దేశ పౌరులు జమ్మూ‌‌- కాశ్మీర్ కు రావొద్దు..వస్తే అత్యాచారాలు పెరుగుతాయ్

పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీకి అత్యంత సన్నిహితుడు, పీడీపీ మాజీ ఎమ్మెల్సీ  సురీందర్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత భూభాగమైన జమ్మూ‌‌– కాశ్మీర్ మనదేశ పౌరులు స్థిరపడితే అత్యాచారాలు పెరుగుతాయంటూ తనలోని పైత్యాన్ని వెళ్లగక్కాడు.

రెండు రోజుల క్రితం ఆగస్ట్ 5,2019 పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.  జమ్మూ- కాశ్మీర్ లో దేశంలో ఏ పౌరుడైనా అక్కడ వ్యవసాయ భూములు కాకుండా స్థలాలు కొనుగోలు చేసే హక్కును కల్పించింది.

ఈ చట్టంపై సురీందర్ మాట్లాడుతూ కేంద్ర పాలితప్రాంతమైన జమ్మూ- కాశ్మీర్ లో మనదేశానికి చెందిన పౌరులు అంటే భారతీయులు ఇక్కడ భూముల్ని కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. అలా చేయడం వల్ల ఇక్కడ అత్యాచారాలు పెరిగిపోతాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

అంతేకాదు జమ్మూకు గొప్ప డోగ్రా సంస్కృతి మరియు వారసత్వం ఉంది. మేం ప్రాంతం కోసం త్యాగాలు చేశాము.  వారు (దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బయటి వ్యక్తులు) ఇక్కడ స్థిరపడటానికి వచ్చిన వెంటనే అత్యాచారాలు పెరుగుతాయి. అని నేను చెబుతున్నది కాదు.  అస్సాం మరియు మహారాష్ట్ర ప్రజలు చెబుతున్నారు. బయటి వారు ఇక్కడికి రాకూడదు ఎందుకంటే స్థానికులు ఉద్యోగాలు కోల్పోతారు.

ఈ రోజు, జమ్మూ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ జమ్మూలో చదువుకోవడానికి మహిళలు వివిధ గ్రామాల నుండి వస్తారు. ఫరీదాబాద్‌లో ఒక అమ్మాయి హత్యకు గురైంది. హాత్రాస్ లో ఏం జరిగిందో మీరే చూడండి. నేషనల్ మీడియా సైతం ఈ అంశంపై కథనాల్ని ప్రచారం చేస్తుందని పీడీపీ నేత  సురీందర్ చౌదరి టైమ్స్ నౌకు చెప్పారు.

Latest Updates