గోదాముల్లో ముక్కిపోతున్న పీడీఎస్ బియ్యం

  • రంగుమారి, దుర్వాసనవస్తున్న రైస్
  •  వాటినే రేషన్ షాపులకు సప్లై చేస్తున్న వైనం

మంచిర్యాల జిల్లాలోని గోదాముల్లో నిల్వ చేసిన వందలాది క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ముక్కిపోతున్నాయి. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి పేదలకు రూపాయికి కిలో చొప్పున పంపిణీ చేస్తోంది. కానీ సివిల్ సప్లైఆఫీసర్ల నిరక్ష్యం వల్ల విలువైన బియ్యం రంగుమారి, పురుగులు పట్టి, ముక్కవాసన వస్తున్నాయి. తినడానికి పనికి రాని విధంగా మారిపోతున్నాయి. గోడౌన్లలో గుట్టలుగా పేరుకుపోతున్నఈ బియ్యాన్ని రేషన్ షాపులకు సప్లై చేస్తున్నారు. ఒక్కో షాపునకు ఐదు పది క్వింటాళ్లు పంపిస్తున్నారు. డీలర్లు అడిగినా అధికారులు పట్టించుకోడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కొంతమంది వాటిని కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. మరికొంత మంది మంచి బియ్యంలో కలిపి అందజేస్తున్నారు. జిల్లాలో 2.14 లక్షల మంది కార్డుదారులు ఉండగా, 423 షాపుల ద్వారా ప్రతి నెల 3733 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు.

రెండువేల క్వింటాళ్లకుపైనే…

జిల్లావ్యా ప్తంగా ఉన్న గోడౌన్లలో రెండు వేల క్వింటాళ్లకు  పైగా బియ్యం ముక్కిపోయినట్లు సమాచారం. ఒక్క భీమారంలోని ఏఎంసీ గోడౌన్లలోనే యాభై టన్నులకు పైగా ముక్కిన బియ్యం నిల్వలు ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ గోదాముల్లో వెయ్యి టన్నుల బియ్యం నిల్వులున్నాయి. మరో నలభై లారీల బియ్యం అన్లోడ్ చేయకుండా ఉన్నాయి. లాక్డౌన్ కారణంగా హమాలీలు రాకపోవడంతో అన్లోడ్ కావడం లేదు. అలాగే మంచిర్యాలలోని ఏఎంసీ గోడౌ న్లలో 25 టన్నుల వరకు బియ్యంముక్కిపోగా, లక్సెట్టి పేట, కోటపల్లి సహా మిగిలిన ఎంఎల్ఎస్పాయింట్ల లో సైతం పెద్ద ఎత్తున బియ్యం చెడిపోయాయి.

Latest Updates