ఫీజు నియంత్ర చట్టం తేవాలని సంతకాల సేకరణ

ఫీజు నియంత్ర చట్టం తేవాలని సంతకాల సేకరణ

ఆర్మూర్, వెలుగు: ప్రైవేట్, కార్పొరేట్ ​విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్​చేస్తూ పీడీఎస్ యూ ఆధ్వర్యంలో శనివారం ఆర్మూర్ బస్టాండ్ ప్రాంతంలో సంతకాల సేకరణ నిర్వహించారు. పీడీఎస్ యూ ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు డి.నిఖిల్ మాట్లాడుతూ.. విద్యారంగాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేయడంతో సర్కారు విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇవ్వడంతోనే ఈ పరిస్థితి ఎదురైందన్నారు. పెండింగ్​ స్కాలర్​షిప్, రీయింబర్స్​మెంట్​ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.