నిర్భయ ఆత్మకు శాంతి చేకూరింది: ఆశాదేవి

నిర్భయ దోషులకు ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామున 5.30 గంటలకు ఉరితీత పూర్తైంది. ఆ తర్వాత నిర్భయ తల్లి ఆశాదేవి విజయ చిహ్నం చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగిందని, నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందని అన్నారు. తన కుమార్తె లేదని, ఇకపై రాదన్న ఆమె కుమార్తెను కోల్పోయిన తర్వాత తాము పోరాటం ప్రారంభించినట్టు తెలిపారు. దోషులకు ఉరిశిక్ష అమలు జరిగిన వెంటనే తన కూతురు ఫొటోను హత్తుకున్నానని… మొత్తానికి వారికి ఉరిపడిందని చెప్పారు. ఈ రోజును దేశంలోని అందరి కుమార్తెలకు అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. భారత ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు ఆశాదేవి.

Latest Updates