తెలంగాణలో పీఈసెట్‌ షెడ్యూలు ఖరారు

రాష్ట్రంలో B.P.ED, D.P.ED ప్రవేశాల కోసం పీఈసెట్‌ షెడ్యూలు ఖరారైంది. ఈ నెల 21న పీఈసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ నెల 21 నుంచి ఏప్రిల్‌ 13 వరకు ఆన్‌లైన్‌లో పీఈసెట్‌ కు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో దరఖాస్తు సమర్పించేందుకు మే 6 వరకు గడువు విధించారు. ఏప్రిల్‌ 20 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. మే 13 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు ముగిసిన వారం తర్వాత పీఈసెట్‌ ఫలితాలను ప్రకటిస్తారు.

Latest Updates