పెద్దపల్లిలో కాల్పులు..రిటైర్డ్ ఆర్మీ జవాన్ అరెస్ట్

పెద్దపల్లి జిల్లాలో కాల్పులు జరిపిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. రిటైర్డ్ జవాన్ బద్దెం తిరుమల్ రెడ్డి గాల్లో కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దర్యాప్తు చేసి అరెస్ట్ చేసినట్లు పెద్దపల్లి డీసీపీ రవీందర్ బృందం అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా డీసీబీ రవీందర్ వివరాల ప్రకారం. ధర్మారం మండలం శాయంపేట గ్రామానికి చెందిన బద్దం తిరుమల్ రెడ్డి 2002 నుంచి 2019 వరకు ఆర్మీలో పనిచేశాడు. 2019 డిసెంబర్ 31న రాత్రి శాయంపేటలో ఫ్రెండ్స్ తో కలిసి గాల్లో కాల్పులు జరిపాడు. ఈ ఘటనను ఎవరో మొబైల్ లో వీడియో తీశారు. లేటెస్ట్ గా  ఫిబ్రవరి 13న పెళ్లిలో కూడా తిరుమల్ రెడ్డి గాల్లో కాల్పులు జరిపాడు. ఈ వీడియోలు, పాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పెద్దపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని నుంచి డీబీబీఎల్ వెపన్, 10 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

see more news

రావాలి జగన్ కావాలి జగన్ అని..జైలు పిలుస్తుంది

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన AR రెహ్మాన్

దారుణం.. పెళ్లి పీటలెక్కాల్సిన యువతి ఆత్మహత్య

Latest Updates