ఆంధ్రా బ్యాంకుకు రూ.కోటి ఫైన్.. 10 బ్యాంకులపై ఆర్బీఐ కొరడా

న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంక్ ఆఫ్​ ఇండియా(ఆర్‌బీఐ), బ్యాం క్‌ లపై కొరడా ఝుళిపించడం ప్రారంభించింది. రెగ్యులేటరీ ఆదేశాలను పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తూ.. బ్యాంకింగ్ నిబంధనలను పక్కన పెట్టినందుకు పెనాల్టీలు విధించింది. గత వారం రోజులుగా 10 బ్యాంకులపై ఆర్‌బీఐ యాక్షన్ తీసుకుంది. ఇతర బ్యాంకు లతో సమాచార మార్ పిడి చేసు కోవడం, అకౌంట్లను పునర్వ్యస్థీ కరించడం విషయాల్లో బ్యాంకింగ్ నిబంధనలను ఆయా బ్యాం క్‌ లు పాటించలేదని ఆర్‌ బీఐ పేర్కొం ది. అదేవిధంగా మోసాలను రిపోర్టు చే యకపోవడం, ‘నో యువర్ కస్టమర్’ నిబంధనలను, యాంటీ మనీ లాండరింగ్ ప్రమాణాలను సరిగ్గా అమలు చేయలేదని తెలిపింది.

ఏయే బ్యాంకుపై ఎంత జరిమానా…?
అలహాబాద్ బ్యాంక్ రూ. 1.5 కోట్లు , ఆంధ్రా బ్యాంక్ కోటి రూపాయలు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ.1.5 కోట్లు , ఇండియన్ ఓవర్‌ సీస్ బ్యాంక్ రూ.1.5 కోట్లు, హెచ్‌ డీఎఫ్‌ సీ బ్యాంక్ లిమిటెడ్ రూ.20 లక్షలు, ఐడీబీఐ బ్యాంక్ రూ.20 లక్షలు, కొటక్ మహింద్రా బ్యాంక్ రూ.20 లక్షలు, యూకో బ్యాంక్ రూ.2 కోట్లు , యాక్సిస్ బ్యాంక్ రూ.2.20 కోట్లు , సిండికేట్ బ్యాంక్ రూ.కోటి.

Latest Updates