పేషెంట్స్ న్యూడ్ ఫొటోలను బాయ్ ఫ్రెండ్ కు పంపిన నర్స్

హాస్పిటల్ కు వచ్చే మహిళా పేషెంట్స్ నగ్న చిత్రాలను సెల్ ఫోన్ లో తీసి తన బాయ్ ఫ్రెండ్ కు పంపిన ఓ నర్సు జైలు పాలైంది. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగింది. అమెరికా పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అశ్లే అన్ స్మిత్ అనే 30 ఏళ్ల నర్స్ డావోస్ డర్గ్ లోని ఓ హస్పిటల్ లో పనిచేస్తుంది. ఆ హాస్పిటల్ కు వచ్చే మహిళా పేషెంట్స్ ను టెస్ట్ చేసే సమయంలో వారు సెమీ న్యూడ్ గా ఉన్న ఫొటోలను తీసి తన బాడ్ ఫ్రెండ్ కు పంపేది. పంపిన 20 ఫొటోలలో పది మందికి పైగా న్యూడ్ ఫొటోలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మే 2017 నుంచి  మహిళా పేషెంట్స్ ల న్యూడ్ ఫొటోలు తీస్తుందని  పోలీసులు తెలిపారు. నర్స్ పై అనుమానం వచ్చిన ఓ పేషెంట్ ఎప్రిల్ 2019 న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నర్స్ ను పోలీసులు  అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. నర్స్ తన బాయ్ ఫ్రెండ్ కు పంపిన న్యూడ్ ఫొటోలలో రెండేళ్ల చిన్నిరి ఫొటో కూడా ఉండటం దారుణం. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.