అవి ఏలియన్సా…ఫ్లయింగ్ సాసర్సా

  • ఆకాశంలో యూఎఫ్ఓ ల వీడియోలు రిలీజ్ చేసిన పెంటగాన్
    వాషింగ్టన్ : ఏలియన్స్, ప్లయింగ్ సాసర్స్ అసలు ఉన్నాయా? దీనిపై దశాబ్దాలుగా డిస్కషన్స్ సాగుతున్నాయి. కొంతమంది ఏలియన్స్ ఉన్నాయని నమ్ముతుంటే…మరికొంత మంది ఇదంతా ట్రష్ అని కొట్టిపాడేస్తున్నారు. కానీ అసలు వీటి ఉనికి గురించి తెలుసుకోవాలని మాత్రం ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి ఐతే ఉంది. ఈ ఆసక్తి మరింత పెంచేలా అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ మూడు వీడియోలు విడుదల చేసింది. ఈ మూడు వీడియోలోనూ గుర్తించటానికి వీలుకాని దృశ్యాలు అంటే అన్ ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ అబ్జెక్స్ట్ (యూఎఫ్ఓ) లు ఉన్నాయి. ఇలాంటి యూఎఫ్ఓ లతో ఉన్న వీడియోలను ఒక దేశం విడుదల చేయటం ఇదే తొలిసారి. ఈ మూడు వీడియోలు కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో ఉన్నవే. జనాల్లో అపోహాలను పొగొట్టేందుకే వీటిని రిలీజ్ చేశామని పెంటగాన్ తెలిపింది. ఇందులో ఉన్న ఒక్క వీడియోను అమెరికా నేవీ పైలటర్లు 2004 నే వీడియో తీశారు. ఈ వీడియోలో కొన్ని వస్తువులు ఆకాశం నుంచి వేగంగా దూసుకెళ్తూ కనిపిస్తున్నాయి. మరో వీడియోను 2015 జనవరిలో రికార్డు చేశారు. దీనితో పాటు మరో వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఉన్న వీడియోలను మళ్లీ విడుదల చేయటం చర్చనీయంగా మారింది.

Latest Updates