వద్దన్నా.. మిసైల్‌‌ను పరీక్షించిన అమెరికా

ఇంటర్మీడియట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిసైళ్లను తయారు చేయొద్దు.. పరీక్షించొద్దు’.. ఇదీ ఇంటర్మీడియట్​ న్యూక్లియర్​ ఫోర్సెస్​ (ఐఎన్​ఎఫ్​) ఒప్పందం. ఆ మిసైళ్ల తయారీ, వాడకాన్ని నిషేధిస్తూ పెట్టిన బిల్లు కూడా అమెరికా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాసైంది. కానీ, ఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రీటీతో పాటు తన సొంత బిల్లునే ఉల్లంఘించింది అమెరికా. పసిఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహా సముద్రంపై ఆ రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బాలిస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిసైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరీక్షించింది. ‘‘భూమి నుంచి ప్రయోగించే బాలిస్టిక్​ మిసైల్​ను అమెరికా రక్షణ శాఖ పరీక్షించింది. గురువారం ఉదయం 8.30 గంటలకు కాలిఫోర్నియాలోని వాండెన్​బర్గ్​ ఎయిర్​ఫోర్స్​ బేస్​ నుంచి ఆ మిసైల్​ను పరీక్షించారు. దాదాపు 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక అది సముద్రంలో పడిపోయింది. ఈ పరీక్షలో తేలిన విషయాలను రక్షణ శాఖకు తెలియజేస్తాం. భవిష్యత్తులో ఆ మిసైల్​ను మరింత అభివృద్ధి చేస్తాం” అని పెంటగాన్​ ప్రతినిధి లెఫ్టినెంట్​ కర్నల్​ రాబర్ట్​ కార్వర్​ తెలిపారు.

ఏంటీ ఆ ఒప్పందం?

భూమి నుంచి ప్రయోగించే బాలిస్టిక్​, క్రూయిజ్​ మిసైళ్లు, మిసైల్​ లాంచర్లను నిషేధిస్తూ 1987లో రష్యాతో చేసుకున్న ఒప్పందమే ఈ ఐఎన్​ఎఫ్​ ట్రీటీ. ఆ ఒప్పందం ప్రకారం 500 కిలోమీటర్ల నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు రేంజ్​ ఉన్న ఏ మిసైల్​నూ అమెరికాగానీ, రష్యాగానీ, ఇతర నాటో దేశాలుగానీ అభివృద్ధి చేయడంగానీ, పరీక్షించడం గానీ నిషిద్ధం. కానీ, రష్యా ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ మిసైళ్లను తయారు చేస్తోందని అమెరికా ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. ఎస్​ఎస్​ఈ–8/9ఎం729 అనే మిసైల్​ను ఇప్పటికే రష్యా రెడీ చేసి మోహరించిందని అమెరికా, నాటో సభ్య దేశాలు ఆరోపించాయి. ఆ ఆరోపణల నేపథ్యంలోనే ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా ఆ ట్రీటీ నుంచి బయటకొచ్చేసింది. ఆగస్టులో మొట్టమొదటిసారిగా క్రూయిజ్​ మిసైల్​ను ప్రయోగించింది. ఇప్పుడు రెండోసారి బాలిస్టిక్​ మిసైల్​ను టెస్ట్​ చేసింది.

Latest Updates