దేశంలో త్వ‌ర‌లో విమాన ప్ర‌యాణాలు స్టార్ట్!: పాటించాల్సిన జాగ్ర‌త్త‌ల డ్రాఫ్ట్

క‌రోనా లాక్ డౌన్ తో పూర్తిగా నిలిచిపోయిన ర‌వాణా సౌక‌ర్యాలు ఒక్కొక్క‌టిగా మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌స్తున్నాయి. దేశ వ్యాప్తంగా న్యూఢిల్లీ నుంచి 15 రూట్ల‌లో మంగ‌ళ‌వారం స్పెష‌ల్ ట్రైన్ల‌ను స్టార్ట్ చేసిన కేంద్ర ప్ర‌భుత్వం.. తాజాగా దేశీయ విమాన ప్ర‌యాణాలు మొద‌లుపెట్టేందుకు సిద్ధ‌మ‌వుతోంది. కొద్ది రోజుల్లోనే విమానాల‌ను స్టార్ట్ చేసే రెడీ అవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఫేజ్ – 1 విమాన ప్ర‌యాణాల‌కు ప్రారంబించేందుకు ప్ర‌యాణికులు, ఎయిర్ పోర్టులు, ఏవియేష‌న్ సంస్థ‌ల‌కు పౌర విమాన‌యాన మంత్రిత్వ శాఖ స్టాండ‌ర్డ్ ఆప‌రేష‌న్ ప్రొటోకాల్ ను జారీ చేసేందుకు ముసాయిదాను రెడీ చేస్తోంది. ఇందుకోసం ఆయా సంస్థ‌ల నుంచి, నిపుణుల నుంచి కొన్ని సూచ‌న‌ల‌ను తీసుకుంటోంది. ముఖ్యంగా 80 ఏళ్లు అంత‌క‌న్నా ఎక్కువ వ‌య‌సు ఉండే వాళ్ల‌ను ఈ ప్ర‌యాణాల‌కు అనుమ‌తించ‌కూడ‌ద‌ని స‌ల‌హాలు అందుతున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే తొలి ద‌శ ప్ర‌యాణాల‌కు క్యాబిన్ ల‌గేజీకి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌కూడ‌ద‌ని, చెకిన్ బ్యాగేజీ 20 కిలోల కంటే త‌క్కువ ఉండాల‌ని ప‌లు సూచ‌న‌లు అందాయి.

– ఎయిర్ పోర్టుల్లో థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ చేసి ల‌క్ష‌ణాల‌ను లేని వారిని మాత్ర‌మే ఎయిర్ పోర్టులోకి అనుమ‌తించాలి.

– ఎయిర్ పోర్టు స్టాఫ్‌, పైల‌ట్స్ స‌హా అంద‌రికీ స్క్రీనింగ్ టెస్టులు చేశాకే డ్యూటీలోకి అనుమ‌తించాలి.

– ప్ర‌తి ఒక్క‌రి ఫోన్ లో ఆరోగ్య సేతు యాప్ ఉండాలి. అందులో స్టేట‌స్ గ్రీన్ ఉంటేనే ప్ర‌యాణానికి ప‌ర్మిష‌న్.

– ప్ర‌తి ప్ర‌యాణికుడికీ ఫేస్ మాస్క్ త‌ప్ప‌నిస‌రి.

– ఎయిర్ పోర్టు ఎంట్రీ ఎగ్జిట్ ల‌లో హ్యాండ్ శానిటైజ‌ర్ అందుబాటులో ఉండాలి.

– విమానాశ్ర‌యాల్లో, ఫ్లైట్ లో సోష‌ల్ డిస్టెన్స్ పాటించేలా ఏర్పాట్లు చేయాలి.

Latest Updates