జహీరాబాద్ పరిశ్రమలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు

తాగే నీటిలో కాలుష్యం.. పంట పొలాల్లో కాలుష్యం.. ఎక్కడ చూసినా పొల్యూషన్. సంగారెడ్డి.. జహీరాబాద్ నియోజకవర్గంలోని పరిశ్రమలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగు నీరు కూడా పొల్యూట్ కావడంతో ప్యూరీ ఫైడ్ వాటర్ కొనుక్కొని తాగుతున్నారు. బోరు బావులు, చెరువులు,  కుంటల్లోని కాలుష్యం చేరడంతో నీరంతా రంగు మారింది. ఇటు పొలాల్లోకి కలుషిత నీరు చేరడంతో పంటలు ఎండిపోతున్నార. అప్పు తెచ్చి పంటలు వేస్తే… కళ్ల ముందే పంట ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండలంలో కాలుష్యం సమస్య తీవ్రంగా ఉంది. మండలంలోని కెమికల్ ఫ్యాక్టరీలో వెలువడే పొల్యూషన్ తో ఇబ్బందులు పడుతున్నామని స్ధానికులు చెబుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని.. వాపోతున్నారు.  కలుషితమైన నీటితో చర్మ వ్యాధులు వస్తున్నాయని చెబుతున్నారు.  ఇప్పటికైన అధికారులు స్పందించి కాలుష్యం నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు.

Latest Updates