జగన్ పాలనపై ప్రజలకు నమ్మకం ఉంది: పోసాని

జగన్ ముఖ్యమంత్రి కావాలని దేవుళ్లందరికీ మొక్కుకున్నానన్నారు సినీ నటుడు పోసాని కృష్ణమురళి. జగన్ సీఎం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రిగా మంచి పాలన అందిస్తారనే నమ్మకం ప్రజలందరికీ ఉందన్నారు. తన కోరిక నెరవేరడంతో అమీర్ పేట్, బేగంపేట, ఫిలీంనగర్ లోని ఆలయాల్లో దేవుళ్లకు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నానని తెలిపారు. జగన్ సీఎం కావాలన్నదే నా చివరి కోరిక… ఆ కోరిక నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అంతేకాదు కేసీఆర్ సీఎం కావాలని గతంలోనూ దేవుడిని కోరి… మొక్కులు తీర్చుకున్నానని చెప్పారు. ఇన్నాళ్లు జగన్ పై ఆరోపణలు చేసిన చంద్రబాబు.. ఇప్పటికైనా తన మనసు మార్చుకుని ఆయనపై బనాయించిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలన్నారు పోసాని.

Latest Updates