అనకొండ రోడ్డు దాటింది.. ఝల్లుమనిపించే వీడియో

పాము కనిపిస్తేనే భయపడిపోతారు చాలామంది. అలాంటిది అనకొండ కనిపిస్తే… భయానికి బాబు వచ్చేస్తాడు గుండెల్లోకి. అచ్చు అనకొండ లాంటిదే.. ఓ పెద్ద పాము రోడ్డుపైకి వచ్చేసింది. దాన్ని చూసి జనం అందరూ ముందు జడుసుకున్నారు.

బ్రెజిల్ లో 364 నంబర్ హైవేపై ఈ సంఘటన జరిగింది. అడవి మధ్యలో ఈ హైవే ఉండటంతో… అప్పుడప్పుడూ కొన్ని జంతువులు, పెద్ద పెద్ద పాములు రోడ్డుపైకి వస్తుంటాయట. అలా… ఏప్రిల్ 23న సడెన్ గా రోడ్డుపైకి ఓ 12 అడుగుల పొడవున్న పెద్ద పాము వచ్చేసింది. వెంటనే వాహనాలన్నీ ఎక్కడివక్కడే ఆగిపోయాయి. అది కరవదని తెలియడంతో.. కొందరు ధైర్యం చేశారు. దాని మానాన అది రోడ్డు దాటి పక్కనే పొదల్లోకి వెళ్తుండగా.. కొందరు సెల్ ఫోన్లలో వీడియో తీశారు.

సోషల్ మీడియాల ో పోస్టయిన ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్… వేలల్లో షేర్స్ వచ్చాయి. ఇంత పెద్ద స్నేక్ తాము ఎన్నడూచూడలేదని చాలామంది కామెంట్స్ చేశారు.

Não consegui filmar ela passando por cima da divisória da BR 😅 pois tive que parar o trânsito para que ela não fosse atropelada

Italo Nascimento Fernandes 发布于 2019年4月22日周一

Latest Updates