తమిళనాడులో మొదలైన టపాసుల మోత

తమిళనాడులో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఉదయం నుంచే పేలుళ్లతో వీధులన్నీ మోతెక్కిపోతున్నాయి. చెన్నైతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పొద్దున్నే ప్రజలు టపాసుల మోత మోగించారు. చిన్నా, పెద్దా అందరూ కలిసి పండగను ప్రారంభించారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు బాణసంచా కాల్చుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చుకునేందుకు అనుమతించగా, ఈ ఉత్తర్వులు సడలించాలని, ఉదయం పూట కాల్చడం తమ సంప్రదాయమని తమిళనాడు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు తన తీర్పును సడలిస్తూ, రోజులో ఎప్పుడైనా రెండు గంటల పాటు టపాసులు కాల్చుకునేందుకు అనుమతించింది.

Latest Updates