మారుతున్న ట్రెండ్: మట్టి వినాయడికే డిమాండ్

వినాయకచవితి  అనగానే   ప్లాస్టర్  ఆఫ్  పారిస్ తో తయారు  చేసిన  పెద్ద పెద్ద  వినాయకులే  గుర్తుకొస్తాయి. అయితే ఈసారి మాత్రం మట్టి గణపతులకే డిమాండ్ ఉందంటున్నారు తయారీదారులు. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ సంవత్సరం మట్టివినాయకుల కోసం చాలామంది అడ్వాన్స్ ఇచ్చారని తెలిపారు. దీంతో విగ్రహాల తయారీలో తాము బిజీ అయ్యమని ఇందుకు నాణ్యమైన మట్టిని తెప్పించామని చెప్పారు.

మట్టి వినాయక విగ్రహాల వల్ల పర్యావరణానికి… చెరువులకు కూడా మేలు జరుగనుందని అంటున్నారు ప్రకృతి ప్రేమికులు. ఒకప్పుడు  మట్టి వినాయకులనే పూజించేవారమని.. వినాయక విగ్రహాన్ని తయారు చేసే మట్టిలో దినుసులను వేసే వారమని అవి చెరువులోని చేపలకు ఉపయోగపడేవని గుర్తుచేసుకున్నారు.

 

Latest Updates