రాష్ట్రానికి సీఎం ఉన్నారని ప్రజలు మర్చిపోయారు

సీఎం కేసీఆర్ ఏరియాల్ వ్యూ చేస్తే పరిస్థితి ఏం తెలుస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రానికి సీఎం ఉన్నాడనే విషయాన్ని ప్రజలు మర్చిపోయారన్నారు. వరంగల్, హన్మకొండ, హసన్ పర్తిలో పర్యటించిన బండి సంజయ్ వరద ముంపు ప్రాంతాలను… నీట మునిగిన పంటపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం వర్షాలతో అతలాకుతలం అవుతుంటే సీఎం కేసీఆర్ ఫౌంహౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాడని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఎటు వెళ్లాయో వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధుల అసమర్థత  కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులను దుర్వినియోగం చేశారన్నారు.

ప్రతి విషయంలో కేంద్రంపై నిందలు వేయడం మానుకుని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు బండి సంజయ్. గత కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కటైన నేరవేర్చరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వరంగల్ కు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. అంతేకాదు వరంగల్ లో పర్యటించి ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దాలన్నారు బండి సంజయ్.

Latest Updates