కశ్మీర్‌లో అభివృద్ధితో భారత్‌లోకి POK

జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి చూసి పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (POK) ప్రజలు భారత్‌లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారన్నారు గవర్నర్ సత్యపాల్‌ మాలిక్‌. POK ను విలీనం చేసుకోవడానికి భారత్‌ ఎలాంటి బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదన్నారు. అక్కడి ప్రజల్లో విశ్వాసం కల్పిస్తే వారే పాక్ వ్యతిరేకంగా తిరగబడి భారత్‌లో చేరడానికి వస్తారన్నారు. మంత్రులు అంతర్జాతీయ అంశాలపై మాట్లాడటానికి అవకాశం లేక, POKను స్వాధీనం చేసుకోవాలంటూ అదే పనిగా మాట్లాడుతున్నారని అన్నారు. POK మన తర్వాత లక్ష్యమన్న సత్యపాల్ మాలిక్.. జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి ద్వారా దానిని మనం తీసుకోవచ్చన్నారు.

 

Latest Updates