న్యూస్ చానళ్లకు భలే డిమాండ్

న్యూస్ చానల్సే మస్తు చూస్తున్రు

గంటలతరబడి స్మార్ట్ ఫోన్లతోనే యువత
టీవీల్లో పెరిగిన ఫుడ్, డ్రింక్స్ యాడ్స్
అత్యంత ఆదరణ పొందిన సీరియల్..రామాయణం
43% పెరిగిన సోషల్ నెట్ వర్కింగ్ యాప్ప్ వాడకం
నీల్సన్-బార్క్ వీక్లీ రిపోర్ట్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: లాక్ డౌన్ తో 24 గంటలూ ఇంట్లోనే. ఏమీ తోచడం లేదు. చూస్తే టీవీ.. లేకుంటే ఫోన్. ఈ రెండే టైమ్ పాస్. లాక్ డౌన్
తర్వాత టీవీ, ఫోన్ల వాడకం దేశంలో రికార్డు స్థాయిలో పెరిగిందని బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌(బార్క్) – నీల్సన్ వీక్లీ తాజా రిపోర్టు చెబుతోంది. లాక్ డౌన్ ప్రకటించిన తొలివారంలో దేశవ్యాప్తంగా 8 శాతం మేర టీవీ చూడ్డం అధికమవగా, అది రెండో వారానికి 37 శాతానికి పెరిగిందట. తెలుగు రాష్ట్రాల్లో ఈ పెరుగుదలరేటు 28 శాతంగా నమోదైంది. ఇక టీవీల్లో ఫుడ్, డ్రింక్స్ యాడ్స్ కూడా పెరిగాయని ఈ రిపోర్ట్ చెబుతోంది.

చానళ్లకే ఎక్కువ వ్యూయర్ షిప్
దేశంలోని అన్ని భాషా చానళలో్ల న్యూస్ చానళ్లలోనే ఎక్కువ మంది చూస్తున్నట్లు ఈ రిపోర్టు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 11 నుంచి 31 వరకు రిపోర్ట్ రేటుతో పోలిస్తే న్యూస్ చానళ్ల టీవీ వ్యూయర్షిప్ 298 శాతానికి పెరిగింది. బిజినెస్ న్యూస్ కు 180 శాతం, ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కు 63 శాతం, సినిమాలకు 56 శాతం, కిడ్స్ చానళ్లకు 39 శాతం, ఆధ్యాత్మిక చానళ్లకు 26 శాతం వ్యూయర్షిప్ పెరిగింది. ప్రతి రోజు 622 మిలియన్ల మంది టీవీ చూస్తుండగా రోజులో సగటున 4 గంటల 40 నిమిషాల పాటు టీవీ ముందు గడుపుతున్నట్లు ఈ రిపోర్ట్ రేటులో తేలింది. లాక్‌‌డౌన్‌ ముగిసేవరకు ఇదేస్థాయిలో వీక్షకుల సంఖ్య నమోదవుతుందని బార్క్‌‌ చీఫ్‌ ఎగ్జ్ క్యూటివ్‌‌ సునీల్‌ లుల్లా తెలిపారు. నాన్‌‌ ప్రైమ్‌‌ టైంలోనూ వీక్షకుల సంఖ్య భారీగానే ఉందట.

‘రామాయణం’ చూస్తున్నరు
లాక్‌‌డౌన్‌ నేపథ్యంలో రామాయణం, శక్తిమాన్‌‌ వంటి సీరియల్స్‌‌ను దూరదర్శన్ తిరిగి ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. మార్చి 28న ఉదయం ప్రసారమైన రామాయణం సీరియల్ ను 3.40 కోట్ల మంది చూడగా, సాయంత్రం ఎపిసోడ్ ను 4.50 కోట్ల మంది చూశారు. మరుసటి రోజు ఉదయం 4 కోట్ల మంది, సాయంత్రం ఎపిసోడ్ ను 5.10 కోట్ల మంది చూడడం విశేషం. ఇది గత కొన్నేళ్లుగా ప్రసారవుతున్న సీరియల్స్ లో ఈ స్థాయి ఆదరణ రామాయణానికే దక్కడం గమనార్హం.

పెరిగిన స్మార్ట్‌ఫోన్ల వాడకం
లాక్‌‌డౌన్‌ తో స్మార్ట్‌ఫోన్ల వాడకం మరింత పెరిగింది. గతంతో పోలిస్తే ఇది 12% అధికం. రోజుకు సగటున 3.8 గంటలు, వారానికి 26.4 గంటలు ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్లతో బిజీగా గడుపుతున్నారు. లాక్‌‌డౌన్‌ కు ముందు రోజుకు 3.4 గంటలు లేదా వారానికి 23.6 గంటలు స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే వారని ఈ నివేదిక వెల్లడించింది. 15–24 ఏళ్ల వయసు వారి వాడకం 12% పెరగగా, 25నుంచి 34 ఏళ్ల వారిలో 9%, 35నుంచి 44 ఏళ్లు కలిగిన వారి వాడకం 18% పెరిగింది. చాటింగ్ చేయడం 43%, సోషల్ మీడియాలో సమయం 42% పెరిగింది.

For More News..

కరోనాకు ముందు.. తర్వాత..

ఉద్యోగులకు షాక్ ఇస్తున్న కంపెనీలు.. రాత్రికి రాత్రే టర్మినేషన్ లెటర్లు

Latest Updates