లాక్‌‌డౌన్ సడలించినా షాపింగ్ చేయట్లే..

బాగా తగ్గిపోయిన సేల్స్
దెబ్బతిన్న మాల్స్ వ్యాపారాలు
బట్టల నుంచి బ్యూటి కిట్స్ వరకు సేల్స్ డౌన్

న్యూఢిల్లీ: కరోనా లాక్‌‌డౌన్ నిబంధనలను కేంద్రం సడలించినప్పటికీ.. సిటీల్లో ప్రజలు షాపింగ్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్‌‌‌‌ఏఐ) ఈ నెల 1వ తారీఖు నుంచి 15 వరకు చేపట్టిన సర్వేలో, మాల్స్‌‌లో వ్యాపారాలు ఇయర్ ఆన్ ఇయర్ 77 శాతం తగ్గిపోయినట్టు రిటైలర్స్ తెలిపారు. స్ట్రీట్స్‌‌లో వ్యాపారాలు కూడా 60 శాతం వరకు పడిపోయినట్టు చెప్పారు. కరోనా వైరస్‌భయంతో దేశంలో కన్జూమర్ సెంటిమెంట్ తగ్గినట్టు పేర్కొన్నారు. దేశంలో ఉన్న 100 మంది పెద్ద, చిన్న రిటైలర్లపై ఆర్‌‌‌‌ఏఐ ఈ సర్వే చేపట్టింది. రెస్టారెంట్లు, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (క్యూఎస్‌ఆర్‌‌‌‌లలో) కస్టమర్ల సంఖ్య బాగా తగ్గినట్లు సర్వేలో తేలింది. ఏడాది లెక్కన రెస్టారెంట్లు, క్యూఎస్‌ఆర్‌‌‌‌లలో సేల్స్ 70 శాతం పడినట్టు తెలిపింది. బట్టలు, ఆభరణాలు నుంచి యాక్ససరీలు, బ్యూటీ కిట్స్ వరకు అన్ని కేటగిరీల్లో సేల్స్ ఈ నెల తొలి 15 రోజుల్లో 60 శాతానికి పైగా పడిపోయినట్టు తెలిసింది.

గ్రోసరీ, వైట్ గూడ్స్ లో కొద్ది రికవరీ..
కేంద్ర ప్రభుత్వ ప్రకటన తర్వాత జూన్ ప్రారంభంలోనే చాలా రాష్ట్రాల్లో మాల్స్, హై స్ట్రీట్ రిటైలర్స్ తమ షాపులను 70 రోజుల అనంతరం తిరిగి ప్రారంభించారు. అయినప్పటికీ కరోనా వైరస్ భయంతో ఇంకా కన్జూమర్ సెంటిమెంట్ చాలా తక్కువగానే ఉన్నట్టు ఆర్‌‌‌‌ఏఐ సర్వేలో వెల్లడైంది. ఆశ్చర్యకరంగా ఫర్నీచర్, ఫుడ్, గ్రోసరీ, కన్జూమర్ డ్యూరబుల్స్ లో రికవరీ కనబడుతున్నట్టు రిటైలర్స్ చెప్పారు. రూ.300 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న పెద్ద సైజు రిటైలర్లు సేల్స్ విషయంలో 14 శాతం ఇయర్ ఆన్ ఇయర్‌‌‌‌ గ్రోత్‌‌ను రిపోర్ట్ చేశారు. కన్జూమర్లు ముందుగా ప్లాన్ చేసుకున్న మొబైల్ ఫోన్లు, ల్యాప్‌‌టాప్‌‌లు, హౌస్‌హోల్డ్ గ్రోసరీలు, ఫర్నిషింగ్ గూడ్స్ మాత్రమే కొంటున్నారు. అయితే చిన్న రిటైలర్లు, మాల్స్ మాత్రం షాపర్లను అందుకోలేక సతమతమవుతున్నాయి. రద్దీ ప్రాంతాలను, గుంపులు గుంపులుగా ఉండటాన్ని ప్రభుత్వం బ్యాన్ చేయడంతో వీటిలో సేల్స్ తగ్గిపోయాయి. కొన్ని కేటగిరీల్లో చిన్న రిటైలర్ల సేల్స్‌‌33 శాతం వరకు తగ్గిపోయినట్లు ఆర్‌‌‌‌ఏఐ చెప్పింది. రెడ్ జోన్ ఏరియాల్లో ఉన్నమాల్స్‌‌లో
అన్ని కేటగిరీల్లో వ్యాపారాలు పూర్తిగా పడిపోయినట్టు పేర్కొంది. చాలా ప్రాంతాల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతుందని చెప్పింది. మాల్స్‌‌లో ఉన్న స్పానింగ్ రెస్టారెంట్లు, అప్పీరల్, ఫుట్‌వేర్ రిటైలర్స్, ఎలక్ట్రానిక్స్ స్టోర్ల సేల్స్ 50–90 శాతం పడిపోయినట్టు తెలిపింది.

ఢిల్లీ, ముంబైలో బాగా తగ్గిన సేల్స్…
వెస్ట్, నార్త్ ఇండియాలో ముఖ్యంగా ఢిల్లీ, ముంబైలో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. మొత్తంగా రిటైల్ ట్రేడ్‌ పడిపోవడం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. రీజియన్ వారీగా.. గత ఏడాదితో పోలిస్తే ఈ నెల తొలి 15 రోజుల్లో వెస్ట్‌‌లో 74 శాతం, నార్త్‌‌ఇండియాలో 71 శాతం సేల్స్ పడిపోయాయి. ఈస్ట్, సౌత్‌‌లో సేల్స్‌‌63 శాతం, 59 శాతం సేల్స్ తగ్గినట్లు ఆర్‌‌‌‌ఏఐ పేర్కొంది. ఈ దెబ్బకు రెస్టారెంట్లు, మాల్ డెవలపర్లు, రిటైలర్లు భారీగా నష్టాలు పాలవుతున్నట్టు చాలా మంది రిటైలర్లు చెప్పారు. ‘ఎకానమీని తిరిగి ప్రారంభించడం మెచ్చుకో దగ్గది. రిటైలర్లు కచ్చితంగా సేఫ్టీ, హైజీన్‌ ప్రొటోకాల్స్‌‌ను పాటించాలి. కన్జూమర్లకు సేఫ్ షాపింగ్ ఎన్విరాన్‌మెంట్‌ను క్రియేట్ చేయాలి. వచ్చే రోజుల్లో రాష్ట్రాల్లో నిబంధనలు ఒకే విధంగా సడలిస్తారని ఆశిస్తున్నాం.

For More News..

గంగూలీ.. అలా కెప్టెనయ్యాడు!

కలిసి ఆడి.. కరోనా అంటిచ్చుకున్నరు

Latest Updates