వెలవెలబోయిన హైదరాబాద్ మెట్రో రైళ్లు

కరోనా  కారణంగా దాదాపు ఐదు నెలల పాటు మూతపడిన హైదరాబాద్ మెట్రో రైలు సేవలు ఇవాళ్టి (సోమవారం) నుంచి పునఃప్రారంభమయ్యాయి. అన్ లాక్- 4 లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనుమతులివ్వడంతో.. మెట్రో రైళ్లు సోమవారం నుంచి పట్టాలెక్కాయి. అయితే, మెట్రో సేవలకు ప్రయాణికుల నుంచి అనుకున్నంత స్పందన కరువైంది. కరోనా కారణంగా, క్లోజ్డ్ గా ఉండే మెట్రో రైళ్లలో ప్రయాణించేందకు జనాలు ఇన్ ట్రెస్టు ఆసక్తి చూపలేదు. తక్కువ సంఖ్యలోనే ప్రయాణికులు మెట్రో స్టేషన్లకు వెళ్లారు. ఢిల్లీ మెట్రోలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అయితే మెట్రో అధికారులు మాత్రం.. రాబోయే రోజుల్లో ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుందంటున్నారు.

Latest Updates