బాడీ ఫిట్ నెస్ కోసం జిమ్స్ కు జనం క్యూ 

బాడీ ఫిట్ నెస్ కోసం జిమ్స్ కు జనం క్యూ 

కరోనా లాక్ డౌన్ సమయంలో చాలామంది ఫిట్ నెస్ పై దృష్టి పెట్టలేక పోయారు. దీంతో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. దీనికి చెక్ చెట్టడానికి ఫిట్ నెస్ సెంటర్స్ కు క్యూ కడుతున్నారు జనం. ఐటీ ఎంప్లాయిస్, కాలేజీ యూత్ తోపాటు... ఇంట్లో  ఉండే మహిళలు కూడా ఫిట్ నెస్ పై ఫోకస్ పెడుతున్నారు.. కరోనా నిబంధనలు పాటిస్తూ వర్కవుట్స్ చేస్తున్నారు... దీంతో ఖమ్మం నగరంలోని పిట్ నెస్ సెంటర్ల సందడిగా మారాయి.
 
బాడీ ఫిటెనెస్ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు ఖమ్మం జనం. దీని కోసం జిమ్ లకు క్యూ కడుతున్నారు. కొందరు ఫ్యాషన్ కోసం, మరికొందరు సిక్స్ ప్యాక్ కోసం... ఇంకొందరు హెల్త్ ఇష్యూస్ పేరుతో ఫిట్ నెస్ సెంటర్స్ కు వెళ్తున్నారు. మొన్నటి వరకు కరోనా భయంతో వెళ్లని జనం కూడా... వాక్సిన్ రావడంతో జిమ్స్ బాట పడుతున్నారు. ఉదయం, సాయత్రం ఏదోక సమయంలో వర్కవుట్స్ చేస్తున్నారు. వయస్సు మీద పడినా ఆ ఎఫెక్ట్ శరీరం పై పడకుండా ఫిట్ గా ఉండేందుకు ట్రై చేస్తున్నారు. 

జిమ్ కు వచ్చే సమయాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. మంచి ట్రైనర్లను పెట్టుకుని శరీరంలోని క్యాలరీస్  ఖర్చు అయ్యే విధంగా జిమ్ చేస్తున్నారు. దీనికి తగ్గట్టు డైట్ ప్లాన్ చేసుకుంటున్నారు. డైలీ వ్యాయామం చేయడం వల్ల బాడీలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు డాక్టర్లు. గుండెకు సంబంధించిన వ్యాధులు రావనీ....  రోజూ కొంత సమయం జిమ్ చేస్తే ఫిట్ నెస్ తో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెబుతున్నారు. మానసిక ఒత్తిడిల నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు ఖమ్మంలోని డాక్టర్స్.

జిమ్ సెంటర్లు కూడా పరిస్థితులకు అనుగుణంగా మారుతూ వస్తున్నాయి. కొత్త రకాల యంత్రాలు కొనుగోలు చేయాల్సి వస్తోందంటున్నారు ట్రైనర్లు. ఏసి జిమ్ లలో కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తాయంటున్నారు. మరోవైపు ఇంటిరీయర్ తో పాటు స్త్రీ , పురుషులకు విభజించి ట్రైన్ చేయాల్సి వుంటుందని చెబుతున్నారు. ట్రెండ్ కు తగ్గట్టుగా ఖమ్మం లాంటి నగరంలో జిమ్స్ ను ఏర్పాటు చేయాలంటే భారీ ఖర్చుతో కూడుకుంటోంది. ఒక ఎక్విప్ మెంట్  తెచ్చినా కొన్ని రోజులకే మరో మోడల్ జిమ్ లవర్స్ ని ఆకర్షిస్తోందంటున్నారు. దీంతో అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు జిమ్ నిర్వాహకులు. 

ఐటీ ఎంప్లాయిస్, కాలేజీ యూత్ తోపాటు... ఇంట్లో  ఉండే మహిళలు కూడా లాక్డౌన్ ఎఫెక్ట్ తో ఫిట్ నెస్ పై ఫోకస్ పెడుతున్నారు. బాడీని మంచి షేప్ లో ఉంచుకునేందుకు అనేక రకాల ట్రిక్స్ ని ఫాలో అవుతూ.. కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తున్నారు.