స్ట్రీట్ ఫుడ్​కు క్యూ కడుతున్నరు

హైదరాబాద్, వెలుగు: కరోనా భయపెడుతున్నా, సీజనల్ డిసీజెస్ ముంచుకొస్తున్నా అవుట్ సైడ్ ఫుడ్ కోసం సిటీ జనం ఎగబడుతున్నారు. రద్దీ ప్రదేశాలకు వెళ్లొద్దని, హైజెనిక్​గా ఉండాలని అధికారులు, డాక్టర్లు హెచ్చరిస్తున్నా.. కనీస జాగ్రత్తల్లేని చోట కూడా చిరుతిండి కోసం క్యూ కడుతున్నారు. లాక్​డౌన్​ తర్వాత స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుండడంతో ఎక్కడ పడితే అక్కడ నచ్చినవి లాగించేస్తున్నారు.

నీట్​గా లేకున్నా..

వైరస్​ను​ కట్టడి చేయాలంటే.. మాస్క్ వాడాలి, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటెన్ చేయాలి, శానిటైజర్ యూజ్ చేయాలి అని అధికారులు జాగ్రత్తలు చెప్తున్నా.. కొందరు పట్టించుకోవడం లేదు. ఏ మాత్రమూ నీట్​గా లేని ప్రదేశాల్లో పెట్టిన ఫుడ్ తినేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నార్మల్ గానే సిటీలో స్ట్రీట్ ఫుడ్​కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్​తో ఫుడ్డీస్ ఇన్నాళ్లూ వాటికి దూరమయ్యారు. మళ్లీ అన్నీ అందుబాటులోకి రావడంతో ఎప్పటిలాగానే బయటి ఫుడ్ తింటున్నారు. సిటీలో చాలావరకు ఫుడ్ ట్రక్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పానీపూరి బండ్లు, బజ్జీల బండ్లు రోడ్ పక్కన ఫుట్ పాత్ ల మీద, చెత్తకుప్పల పక్కన కనిపిస్తున్నాయి. అవేం పట్టించుకోకుండా ఫుడ్ ని తింటున్నారు.

స్పీడ్​గా స్ప్రెడ్ అయ్యే చాన్స్..

గవర్నమెంట్​ కొన్ని రూల్స్​ మస్ట్​ చేస్తూ పర్మిషన్​ ఇచ్చింది. రెస్టారెంట్స్, హోటల్స్​లో ఎప్పటికప్పుడు పూర్తిగా శానిటైజేషన్, కుక్ చేసేవారికి, సర్వ్ చేసేవారికి మాస్క్ లు, గ్లౌజులు, సింగిల్ కాంటాక్ట్ సిస్టమ్, టేబుళ్ల మధ్య 6 అడుగుల దూరం, డిస్పోజబుల్ ప్లేట్స్, మెనూలు ఇలా ఆంక్షలు విధించింది. కానీ ఇవేమీ కనిపించడం లేదు. అందరూ ఒకేచోట గుమిగూడి తింటున్నారు. డిస్పోజబుల్ ప్లేట్స్ యూజ్ చేస్తున్నా నీట్​గా ఉంచడం లేదు. హైజెనిక్ కూడా మిస్ అవుతోంది. కొన్నిచోట్ల కస్టమర్లకు శానిటైజర్​ ఇచ్చి, జాగ్రత్తలతో ఫుడ్ సర్వ్ చేస్తున్నా.. అక్కడి వాతావరణం మాత్రం క్లీన్ గా ఉండడం లేదు. కొద్దిరోజుల కిందట విజయవాడలోని ఓ పానీపూరి బండి వద్ద పానీపూరి తిన్న వ్యక్తి కారణంగా 19 మందికి కరోనా వచ్చింది. ఇలాంటివి చూసినా సిటీలో స్ట్రీట్ ఫుడ్ తినే వాళ్లు ఆగడం లేదు.

హెల్త్ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవద్దు

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న టైమ్​లో అవుట్ సైడ్ ఫుడ్ అవైడ్ చేయడమే బెటర్. వంట చేసేవారికి, సర్వ్ చేసే వారికి జలుబు, దగ్గు ఉన్నా అనుమానించాల్సిందే. వాళ్లలో ఎవరి కైనా పాజిటివ్ ఉంటే తినేవారికి, తినే వారి నుంచి ఇతరులకూ వైరస్ స్ప్రెడ్ అయ్యే చాన్స్ ఉంది. రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్​లో ఆయిల్ కూడా రీయూజ్ చేస్తుంటారు. వాడే పదార్థాలు హైజెనిక్ అవునో, కాదో చెప్పలేం. అలాంటి ఫుడ్ తిని హెల్త్ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవద్దు. మీరు వెళ్లిన చోట సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారో లేదో చెక్ చేసుకోవాలి.
– డా.సన, న్యూట్రిషనిస్ట్

Latest Updates