మంచిగున్నోళ్లకు కరోనాతో డయాబెటిస్‌

లండన్‌: ఆరోగ్యంగా ఉన్నోళ్లకు కరోనా వైరస్‌ డయాబెటిస్‌ను అంటిస్తోందని ఓ స్టడీలో తేలింది. ‘కొవిడ్‌డయావ్‌’ అనే ప్రాజెక్టు కింద 17 మంది అంతర్జా తీయ నిపుణుల బృందం ఈ స్టడీ చేసింది. బాధితు ల్లో చక్కెర స్థా యిలు, మధుమేహం వచ్చే అవకాశాలను రీసెర్చర్లు  పరిశీలించారు. డయాబెటిస్‌ బాధి తులకు వైరస్ ఇంకా  ప్రమాదకారిగా మారితే ఇంతకు ముందు లేనోళ్ల కు అంటిస్తోందని కనుగొన్నారు. అది టైప్‌ 1, టైప్‌ 2నా, ఇంకోటా ఇంకా తెలియదట. ఇప్పటివరకు చేసిన స్టడీల ప్రకారం ఏసీఈ2నే డయబెటీస్‌కు కారణం కావచ్చని భావిస్తున్నారు. దీని ద్వారా మనిషి సెల్స్‌లోకి ఎంటరైన వైరస్‌.. గ్లూకోజ్‌ మెటబాలిజమ్‌ను మార్చేస్తోందని, అదే డయాబెటిస్‌కు దారి తీస్తోందని అనుకుంటున్నారు. కరోనాను జనం తక్కువగా అంచనా వేస్తున్నా రని, వైరస్నుంచి కోలుకున్న తర్వా త  కూడా కొన్ని వ్యాధులు వెంటాడ తాయని రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు.

Latest Updates