సోషల్ మీడియా మారిపోతోంది

మనలో చాలామంది పొద్దున్నే నిద్రలేవగానే మొదట చేసే పని మొబైల్ ఓపెన్ చేసి సోషల్ మీడియా అప్​డేట్స్​ చూసుకోవటమే. మన లైఫ్​లో 30% పైగా టైం  సోషల్ మీడియా అనే వర్చువల్ వరల్డ్​లోనే గడిచిపోతోంది. న్యూస్ అప్​డేట్స్, గేమ్స్, చాటింగ్ ఇలా ప్రతీ దానికీ సోషల్ మీడియామీదే ఆధార పడుతున్నాం. ఈ విషయాన్ని మొదటగా గమనించింది కార్పొరేట్​ వరల్డ్​. తమ ప్రొడక్ట్స్​ను నేరుగా కస్టమర్ దగ్గరికే తీసుకెళ్లేందుకు సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలో పసిగట్టాయి. కాబట్టే వర్చువల్ వరల్డ్ మనల్ని శాసించే స్థాయికి వచ్చేసింది.

మార్కెటింగ్ ప్లాన్

కంటెంట్ అప్​లోడ్ చేయటం కూడా మామూలు విషయం కాదు. అందుకే సెలబ్రిటీల పీఆర్ ప్రమోటర్స్ కూడా సోషల్ మీడియాని ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తూ ప్రమోషన్ పెంచుకుంటున్నారు. అందుకే ఇప్పుడు యూజర్ల మైండ్ సెట్ ఎలా ఉంది? ఏ ఏ ప్రాంతాలు ఎంచుకోవాలి? ఏ ప్రొడక్ట్​ని మార్కెట్​ చేయాలి? అని అనలైజ్ చేసే సోషల్ మీడియా అనలైజర్స్​ తయారయ్యారు. స్పష్టమైన మార్కెటింగ్ ప్లాన్ లేకపోతే ఇక్కడ నిలబడటం కష్టం.

టెంపరరీ కంటెంట్‌‌‌‌

గిగాబైట్ల డాటా అప్​లోడ్ అవుతుండటంతో ఇంటర్నెట్ సర్వర్లు ఆ లోడ్​ని భరించటం కష్టమైంది. అంతే కాకుండా కొన్ని కంటెంట్స్ కొద్ది టైం మాత్రం వ్యాలిడ్​గా ఉంటున్నాయి. వాటికోసమే ఈ ఇన్​స్టంట్​ అప్​లోడింగ్ పెరిగి పోతోంది. అంటే మనం అప్​లోడ్ చేసిన డాటా కొద్దిసేపటి తర్వాత ఆటోమేటిక్ గా మాయమైపోతుంది. ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌, స్నాప్‌‌‌‌చాట్‌‌‌‌లలో వచ్చే స్టోరీలు ఈ రకమైన కంటెంట్‌‌‌‌కు ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎవరికీ పెద్ద పెద్ద పోస్ట్​లు, వీడియోలూ చూసే ఓపిక లేదు. అదే సందర్భంలో కంటెంట్‌‌‌‌ను ఇష్టపడే విధానం కూడా మారిపోతోంది. ముఖ్యంగా చిన్నచిన్న కథల రూపంలో వచ్చే కంటెంట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లు ఎక్కువ వైరల్ అవుతున్నాయి. అవి చిన్నగా, ఎట్రాక్ట్​ చేసేవిగా ఉండటంతో ఒకదాని తర్వాత మరొకటి చదువుతూ గంటల తరబడి గడుపుతున్నారు. ఒక వేళ చదువుతున్న కంటెంట్ బోర్ కొడితే మధ్యలోనే ఆగిపోకుండా అక్కడక్కడా వేరే లింక్స్ కూడా పెడుతున్నారు. అంటే ఎలాగైనా యూజర్ ఆ సైట్​లోనే ఎక్కువ టైం గడపాలి అన్నదే టార్గెట్.

టెక్నాలజీ అడాప్షన్‌‌‌‌ పెరిగిపోతోంది

సోషల్‌‌‌‌ మీడియాలో ఆగ్మెంటెడ్‌‌‌‌ రియాలిటీ (ఎఆర్‌‌‌‌), వర్చువల్‌‌‌‌ రియాలిటీ (విఆర్‌‌‌‌) లాంటి టెక్నాలజీ వాడకం పెరుగుతోంది. సోషల్ వర్చువల్‌‌‌‌ రియాలిటీ వరల్డ్ హారిజన్‌‌‌‌పై ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌ ఇప్పటికే వర్క్ మొదలు పెట్టింది. సోషల్‌‌‌‌ మీడియాలో విఆర్​ను వాడటం ఇప్పుడే మొదలైంది. స్నాప్‌‌‌‌చాట్‌‌‌‌, ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌ వంటి ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లలో ఎఆర్‌‌‌‌ ఫిల్టర్‌‌‌‌లు వచ్చేసాయి. ఇక టిక్ టాక్ కూడా కావాల్సిన విధంగా వీడియోలు చేయటానికి చాలా వెర్షన్స్ వాడుతోంది. అంటే వీడియో ఎడిటింగ్ అవసరం లేకుండా చాలా ఫిల్టర్స్, ఎఫెక్ట్​లతో సింపుల్​గా మన స్మార్ట్ ఫోన్​లోనే చేసుకోవచ్చు.

ఆగ్మెంటెడ్‌‌‌‌ రియాలిటీ

ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌, జూం యాప్స్​లో ఫొటో ఫిల్టర్‌‌‌‌ల కోసం ఆగ్మెంటెడ్‌‌‌‌ రియాలిటీలో చాలా అప్​డేట్స్ తెచ్చాయి. మన ముఖానికి మేకప్‌‌‌‌, సన్‌‌‌‌గ్లాస్‌‌‌‌, బగ్స్ బన్నీ చెవులను, హెయిర్ స్టయిల్స్ మార్చే అప్లికేషన్స్ వచ్చాయి. ఇది సోషల్‌‌‌‌ మీడియా కోసం డెవలప్​ చేసిన అప్లికేషన్‌‌‌‌. ప్రస్తుతానికి ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌, స్నాప్‌‌‌‌చాట్స్​లో ఎక్కువగా ఉన్నప్పటికీ, త్వరలోనే మిగతా సోషల్‌‌‌‌ మీడియా ప్లాట్‌‌‌‌ఫామ్స్​ కూడా దీన్ని అడాప్ట్ చేసుకోబోతున్నాయి.

సోషల్‌‌‌‌ కామర్స్‌‌‌‌

చాలా రకాల బ్రాండ్లు తమ ప్రొడక్ట్​లని మార్కెట్ చేసుకోవటానికి ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌, పింట్రెస్ట్‌‌‌‌, ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌ లాంటి సోషల్‌‌‌‌ మీడియా ప్లాట్‌‌‌‌ఫాంలను చాలాకాలంగా ఉపయోగిస్తున్నాయి. అయితే లాక్ డౌన్ టైంలో సోషల్ మీడియా ప్రమోషన్స్ వల్ల వాటి బిజినెస్ కూడా పెరిగింది. సోషల్ మార్కెటింగ్ బ్రాండ్లకు కొత్త రిటైల్‌‌‌‌ అవెన్యూగా మారింది. ఇప్పుడు ఈ ప్రమోషన్స్ ఇంకా పెరగబోతున్నాయి.

ఈ సంవత్సరం సోషల్ మీడియా ఫ్లాట్​ఫామ్స్ అన్నీ యూజర్లని ఎక్కువ కనెక్టెడ్ గా ఉంచే ప్రయత్నాల్లో మునిగిపోయాయి. కరోనా వల్ల ఊహించిన దానికంటే స్పీడ్​గా మార్పులు వస్తున్నాయి.

వీడియో కంటెంట్‌‌‌‌ హవా

కరోనా వల్ల ప్రపంచంలో ఎన్ని నష్టాలు  వచ్చినా ఎక్కువగా లాభపడింది మాత్రం సోషల్ మీడియా కంపెనీలే. ఈ సంవత్సరం అప్​లోడ్ అయిన వాటిల్లో వీడియో కంటెంట్​దే మొదటి ప్లేస్. టిక్ టాక్, యూట్యూబ్, ఓటీటీ ఫ్లాట్ ఫారమ్స్​ అన్నీ కలిసి రాబోయే రోజుల్లో వీడియో కంటెంట్ ఎంత అవసరమో గుర్తించాయి.  సిస్కో స్టడీ ప్రకారం… 2022 నాటికి, మొత్తం ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ కంటెంట్‌‌‌‌లో 82% ఉండబోయేది వీడియో కంటెంటే. ఫ్యూచర్​లో సోషల్‌‌‌‌ మీడియాలో ఆధిపత్యం చెలాయించేది వీడియోలేనని సిస్కో రిపోర్ట్ చెబుతోంది.

వీడియో కాలింగ్ యాప్స్

ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌, ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌ ఈ రెండూ అన్నిటికన్నా ఎక్కువగా యూజర్స్​ని ఆకర్షించి మొదటి ప్లేస్​లో ఉండేవి. కానీ, ఇప్పుడు ఇక్కడా పోటీ మొదలైంది. షోషల్ మీడియా యాప్స్ ఎంతగా డబ్బులు కురిపించగలదో అర్థమయ్యాక టిండర్, లింక్డ్ ఇన్​లతో పాటు హ్యాంగ్ ఔట్, వాట్సాప్, టెలిగ్రాం లాంటి మెసెంజర్ యాప్స్ కూడా మొదలయ్యాయి. అన్ని చోట్లా ఒకటే సూత్రం కావాల్సిన ఎంటైర్ టైన్​మెంట్​ యూజర్లే ఎంచుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే  బిజినెస్ ప్రమోషన్స్,  తమ ప్రొడక్ట్స్​ని తప్పనిసరి అన్నంతగా జనాన్ని మానుప్యులేట్ చేస్తున్నారు. అయితే కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చెయ్యటం ఫేస్ టు ఫేస్ మనుషులు కలవటం తగ్గిపోయింది. వీడియో కాలింగ్ యాప్స్ ఈ సిచ్యుయేషన్​ని విపరీతంగా క్యాష్​ చేసుకుంటున్నాయి. వీడియో కాలింగ్ ఆప్షన్స్​తో మెసెంజర్ యాప్స్ అప్​డేట్ అయితే. మాస్ మీటింగ్స్ కోసం జూమ్, గూగుల్ మీట్ లాంటివి వచ్చాయి. ఇప్పుడు హవా మొత్తం ఈ వీడియో కాన్ఫరెన్స్ యాప్స్​దే.

లైక్స్‌‌‌‌ కనిపించకుండా…

ఇక ఫేస్ బుక్, ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో వచ్చే పోల్స్, మాస్ కంటెంట్ విపరీతమైన ప్రభావం చూపెడుతున్నాయి. అందుకే ఇంతకు ముందుకంటే ఈ ఇయర్ హాష్​ట్యాగ్స్ ట్రెండ్ మరింత ఎక్కువైంది. ఇక ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌ పోస్ట్‌‌‌‌లకు సంబంధించి, లైక్స్‌‌‌‌ ఫీచర్‌‌‌‌ను తొలగించే అవకాశం వుండడం ఒక పెద్ద మార్పు. దీనిని బీటా వెర్షన్‌‌‌‌లోనూ టెస్ట్ చేశారు. ఈ ఫీచర్‌‌‌‌ను త్వరలోనే ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే చాలా వరకూ లైక్స్ ఆధారంగా మెజారిటీ యూజర్ల ఒపీనియన్స్ మారిపోతుంది. ఇలా లైక్స్ వల్ల వచ్చే సపోర్ట్ వల్ల నిర్ణయాలు మారిపోవటం మరింత ప్రమాదకరంగా తయారయ్యే అవకాశం ఉంది. లైక్స్​ లేకపోతే బ్రాండ్లు తమ ప్రొడక్ట్స్​ని ప్రమోట్​ చేసుకునే విషయంలో మానుప్యులేట్​ చేసే అవకాశం ఉండదు.