ఆఫీస్ కి,ఇంటికి దూరం ఉందా: 19శాతం ఆదాయాన్ని కోల్పోతున్నట్లే

ఆఫీస్ కి, ఇంటికి మధ్య దూరం ఉండడం వల్ల శక్తి హరిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. దూరం శక్తిని హరించేయడంతో పాటు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఓ సర్వే సంస్థ తెలిపింది. ఆఫీస్ కి, ఇంటికి మధ్య దూరం ఉంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి..? దూర ప్రయాణాలు చేసి ఉద్యోగం చేసే వారు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశాలపై ఇనిస్టిట్యూట్ ఫర్ దీ స్టడీ ఆఫ్ లేబర్ అనే సంస్థ సర్వే చేసింది.

సర్వేలో ఆఫీస్ కు కాలినడకన వచ్చే ఉద్యోగుల కంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులు గంటసేపు తమ కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నట్లు తేలింది.

రైలు లేదా కారులో ప్రయాణించే ఉద్యోగుల కంటే కాలినడకన, బైక్ పై ఆఫీస్ కి వచ్చే ఉద్యోగులు ఎక్కువ అసంతృప్తిలో ఉంటున్నారని,  తద్వారా ఒక ఉద్యోగి సగటు నెలసరి జీతంలో 19శాతం అదనపు నెలవారీ ఆదాయాన్ని పొందలేకపోతున్నట్లు తేల్చి చెప్పింది.  20నిమిషాలు అదనపు భారంతోపాటు, 19శాతం ఆదాయాన్ని తృణప్రాయంగా వదిలేస్తున్నట్లు సర్వే నిర్వహించిన సభ్యులు చెబుతున్నారు.

ఎక్కువ సేపు రైలు ప్రయాణం చేసినా, ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినా మీకు పొందాల్సిన అదనపు ఆదాయం దక్కడంలేదని సర్వేలో పాల్గొన్న సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే పనిచేసే ఆఫీస్, ఇంటికి మధ్య దూరం వద్దని, ఉంటే ట్రాఫిక్ లో తోటి సహచరులతో చాటింగ్ చేస్తే ..ప్రయాణం మరింత సులభంగా ఉంటుందని  ఇనిస్టిట్యూట్ ఫర్ దీ స్టడీ ఆఫ్ లేబర్ సర్వేలో తేలింది.

Latest Updates