ఆలూ రైతుల విజయం: కేసును వెనక్కి తీసుకున్న పెప్సికో

గుజరాత్ రైతులపై పెట్టిన కేసును ఉపసంహరించుకుంది పెప్సికో కంపెనీ. సదరు కంపెనీకి చెందిన ‘లేస్ చిప్స్’ తయారీకి ఉపమోగించే FC5 రకానికి చెందిన ఆలుగడ్డలను పండించినందుకు గుజరాత్ రైతులపై 4కోట్ల ఫైన్ కట్టాలని కోర్టులో కేసు వేసింది. దీంతో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో రైతులకు సపోర్ట్ లభించింది. దీంతో పాటే ‘లేస్ చిప్స్’ ను స్వతహాగా బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు నెటిజన్ లు. అయితే ఈ వ్యవహారం లో పెప్సికో కంపెనీ దిగివచ్చింది. రైతులపై వేసిన కేసును వెనక్కి తీసుకుంది. రైతులు పండించిన ఆలును పెప్సికో కంపెనీ కొనడానికి ముందుకు వచ్చింది. ప్రభుత్వం తో జరిపిన చర్చల తర్వాత తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సదరు కంపెనీ తెలిపింది.

Latest Updates