రెండు దేశాల మధ్య సంబంధాలకు ఇదే మంచి సమయం: మోడీ

ప్రధాని నరేంద్రమోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌తో ఆన్‌లైన్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ప్రధాని మోడీ. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ త్వరగా బయటపడాల్సిన అవసరముందన్నారు. సంక్షోభ సమయాన్ని అవకాశంగా మలచుకుందామని కోరారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన చర్చల్లో ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలపై సమీక్షించారు ప్రధాని మోడీ. సమావేశంలో భాగంగా మాట్లాడిన మోడీ…భారత్‌, ఆస్ట్రేలియాలు పరస్పర సహకారంతో ఎదుగుతాయని ఆకాంక్షించారు. అంతేకాదు ఆస్ట్రేలియాతో భారత్‌కు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఈ ద్వైపాక్షిక సంబంధాన్ని వ్యూహాత్మకంగా మలచుకుందామన్నారు మోడీ.

ఆ తర్వాత మాట్లాడిన ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌… ఇండో ఫసిపిక్‌ రీజియన్‌లో పరస్పరం కలిసి పనిచేద్దామని సూచించారు. రెండు దేశాల మధ్య శాస్త్ర, సాంకేతిక అగ్రిమెంట్లు సంతోషదాయకమన్నారు. ఈ సమావేశం ఇరు దేశాల మద్య వాణిజ్య సంబంధాలను మరింత మెరుగుపరుస్తుందని ఆకాంక్షించారు.

అంతేకాదు వాణిజ్య, రక్షణ రంగాల్లో దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించడంపై రెండు దేశాల ప్రధానులు మోడీ, స్కాట్ మోరిసన్ లు చర్చించారు.

Latest Updates