కరోనా భయం : యశోద హాస్పిటల్ లో ఉరేసుకుని ఆత్మహత్య

హైద‌రాబాద్: మలక్ పేట యశోద హాస్పిట‌ల్ లో కరోనాతో చికిత్స పొందుతున్న బాధితుడు(60) భయంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  హాస్పిట‌ల్ లోని 503 రూమ్ ‌లో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. బాత్ రూమ్‌ లోని షవర్ ‌కి.. పేషెంట్ వేసుకునే గౌన్‌ తోనే  ఉరి వేసుకున్నాడు.

చ‌నిపోయిన విష‌యాన్ని ఆసుపత్రి సిబ్బంది గమనించి చాదర్ ఘాట్ పోలీసులకు సమాచారo అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం కోసం మృతదేహాన్నీ ఉస్మానియా హాస్పిట‌ల్ కి తరలించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ నెల 6వ తేదీన  హాస్పిట‌ల్ అడ్మిట్ చేశారు. అయితే ఐసీయూలో ఉన్న అత‌డిని జ‌న‌ర‌ల్ వార్డుకు మార్చామ‌ని రెండ్రోజుల్లో డిశ్చార్జ్ అయ్యేవాడ‌ని, ఈ లోపం భ‌యంతో సూసైడ్ చేసుకున్నాడ‌ని చెప్పాయి హాస్పిట‌ల్ వ‌ర్గాలు.

Latest Updates