లవ్ మ్యారేజ్ చేసుకుని కట్నం కోసం వేధింపులు

  • భర్తపై మల్కాజిగిరి పోలీసులకు కంప్లయింట్ చేసిన భార్య

లవ్ మ్యారేజ్ చేసుకుని తనను కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని ఓ మహిళ మంగళవారం మల్కాజిగిరి పోలీసులకు కంప్లయింట్ చేసింది. ఇన్​స్పెక్టర్ మన్మోహన్ యాదవ్​ కథనం ప్రకారం..వరంగల్ లోని వర్ధన్నపేటకు చెందిన కృష్ణవేణి(26)కి 2012లో పరకాలలో కంప్యూటర్ ట్రైనింగ్ జాబ్ చేసే ఎండీ రఫీక్ తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ప్రేమించుకుని 2013లో సిటీకి వచ్చారు. విషయం తెలుసుకున్న రఫీక్ కుటుంబీకులు కృష్ణవేణి మతం మారితేనే పెళ్లికి ఒప్పుకుంటామని చెప్పారు. దీంతో కృష్ణవేణి మతం మారి రఫీక్ ని పెళ్లి చేసుకుంది. మూడేళ్లుగా రఫీక్,కృష్ణవేణి దంపతులు మల్కాజిగిరినగర్ లో ఉంటున్నారు. కొంతకాలంగా రఫీక్​ లవ్ మ్యారేజ్​ చేసుకుంటే కట్నం ఇవ్వరా అంటూ కృష్ణవేణిని వేధించడం మొదలుపెట్టాడు. ఆ వేధింపులు తాళలేక కృష్ణవేణి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కౌన్సిలింగ్​ ఇచ్చిన సమయంలో బాగానే ఉంటానని చెప్పిన రఫీక్ మళ్లీ కృష్ణవేణిని వేధించసాగాడు. ప్రస్తుతం కృష్ణవేణి 4 నెలల గర్భిణి. అయినా ఆమెను రఫీక్ అతడి కుటుంబీకులు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకోవాలని..మా వాడికి వేరే అమ్మాయితో పెళ్లిచేస్తామని వేధిస్తున్నారు.సోషల్​ మీడియాలో వస్తున్న లవ్​జిహాద్​ తరహాలోనే తాను కూడా మోసాపోయానని మంగళవారం బాధితురాలు కృష్ణవేణి  మల్కాజిగిరి పోలీసులకు కంప్లయింట్​చేసింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు రఫీక్​ కోసం గాలిస్తున్నామని చెప్పారు.

Latest Updates