వీడియో తీయమని లైవ్‌లో నదిలోకి దూకిన వ్యక్తి

విజయవాడలోని కనకదుర్గ వారధిపై దారుణం జరిగింది. పూజ చేసుకుంటానంటూ బ్రిడ్జీపైకి వచ్చిన ఓ వ్యక్తి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తాడిగడపకి చెందిన మన్నే దుర్గాప్రసాద్ బ్రిడ్జీ మీది నుంచి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దుర్గాప్రసాద్ సోమవారం తన తమ్ముడి కొడుకు సుజిత్‌తో కలిసి కనకదుర్గా బ్రిడ్జీపైకి వచ్చాడు. తన ఫోన్ మరియు కొన్ని పేపర్లను పట్టుకోమని సుజిత్‌కి ఇచ్చాడు. తాను చేస్తున్న పూజను వీడియో తీయాలంటూ సుజిత్‌ని కోరాడు. దాంతో దుర్గాప్రసాద్ చేస్తున్న పూజను సుజిత్ వీడియో తీస్తూ నిల్చున్నాడు. అయితే ఉన్నట్టుండి దుర్గాప్రసాద్ బ్రిడ్జీ రైలింగ్ ఎక్కి నదిలోకి దూకాడు. ఆ ఘటన అంతా సుజిత్ వీడియో తీస్తున్న ఫోన్‌లో రికార్డయింది. తన కళ్ల ముందే పెద్దనాన్న నదిలోకి దూకడంతో సుజిత్ షాక్‌కు గురయ్యాడు. సుజిత్ ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి.. దుర్గాప్రసాద్ కోసం నదిలో గాలిస్తున్నారు. అయితే పోలీసుల సూచన మేరకు.. దుర్గాప్రసాద్ ఇచ్చిన పేపర్లను పరిశీలించగా.. తాను అనారోగ్యంతో చనిపోతున్నట్లుగా సూసైడ్ నోట్ లభించింది.

For More News..

వీడియో: తనపై దాడికి యత్నించిన ఎంపీలకు టీ అందించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్

తెలంగాణలో మరో 2,166 కరోనా కేసులు

ఆక్సిజన్‌‌‌‌‌‌‌‌ సిలిండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకుండా పదిసార్లు ఎవరెస్ట్ ఎక్కిన ఆంగ్ రీటా మృతి

Latest Updates