భార్య తల నరికి చేతిలో పట్టుకొని జాతీయగీతం

భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. అటువంటి వాటికి పెద్దగా రియాక్ట్ కానవసరం లేదు. కానీ, ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ఒక వ్యక్తి మాత్రం తన భార్యతో జరిగిన చిన్న గొడవను సీరియస్‌గా తీసుకొని ఆమెను చంపాడు. బారాబంకీ జిల్లా, బహదూర్ పూర్ గ్రామంలో అఖిలేష్ రావత్, అతని భార్యతో కలిసి నివసిస్తున్నాడు. వారిద్దరి మధ్య శనివారం ఏదో విషయంపై గొడవ జరిగింది. దాంతో నిగ్రహం కోల్పోయిన అఖిలేష్.. తన భార్యను చంపేశాడు. ఆ తర్వాత ఆమె తలను మొండెం నుంచి వేరుచేశాడు. తనకు శిక్ష తప్పదనుకున్నాడో ఏమో గానీ, ఆమె తలను తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు బయలుదేరాడు.

అఖిలేష్.. చేతిలో భార్య తలను పట్టుకొని వెళ్తుండటంతో.. రోడ్డు మీద పోయేవారు చూసి జహంగీరాబాద్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. వెంటనే పోలీసులు మార్గమధ్యలో అఖిలేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. పోలీసులు తన వద్దకు రాగానే అఖిలేష్ వెంటనే జాతీయగీతం పాడటం మొదలుపెట్టాడు ఆ తర్వాత ‘భారత్ మాతా కి జై’ అని నినాదం చేశాడు. అలా కాసేపు అఖిలేష్‌కు, పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. ఆ తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని, అతని భార్య తలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన బహదూర్ పూర్ ప్రాంతంలో కలకలం సృష్టించింది. నిందితుడు అఖిలేష్ రావత్ తన భార్యను మొదట హత్య చేసి, ఆపై ఆమె తలను నరికినట్లు పోలీసులు తెలిపారు. చిన్న వివాదమే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసు సూపరింటెండెంట్ అరవింద్ చతుర్వేది తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

For More News..

బడ్జెట్‌లో గ్రేటర్‌కు స్పెషల్​ గ్రాంట్​

బడ్జెట్ స్పీచ్: నిర్మలా సీతారామన్ రికార్డు

Latest Updates