నందిగామలో బైక్ ను ఢీకొట్టిన బస్సు.. వ్యక్తి మృతి

రంగారెడ్డి జిల్లా: నందిగామ శివారులో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి బైక్‌ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ ‌పై ప్రయాణిస్తున్న రంజిత్ సింగ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగినా ఆపకుండా తప్పించుకునేందుకు డ్రైవర్ స్పీడ్ గా బస్సుతో ఉడాయించాడు. అయితే వెంటనే బస్సును ఫాలో అయ్యారు షాద్ నగర్ పోలీసులు.

తమ వాహనంలో వేగంగా వెళ్లిన పోలీసులు బస్సును అడ్డుకుని ,డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. బస్సును కర్నాటకు చెందిన శ్రీలక్ష్మీ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందినదిగా గుర్తించిన పోలీసులు.. పూర్తి వివరాలను తెలుసుకుంటున్నామని తెలిపారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కి తరలించామని తెలిపారు.

For More News..

నచ్చిన కోర్సులో సీటు రాక.. ఇష్టంలేని కోర్సు చదవలేక..

భూములు పాయే..  ప్రాజెక్టు పాయే.. కొలువులు రాకపాయే..

రూ. 170 కోసం దోస్తుల గొడవ.. ఒకరి మృతి

Latest Updates