ఉపాధి పోయిందని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా..

కరోనా కారణంగా ఉపాధి పోయిందని ఓ వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా ఆత్మహత్యాయత్నం చేశాడు. రంగారెడ్డి జిల్లా.. కడ్తాల్‌కు చెందిన నాగులు అనే వ్యక్తి అబిడ్స్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో పనిచేసేవాడు. అయితే కరోనా కారణంగా పెట్టిన లాక్‌డౌన్ వల్ల నాగులు ఉపాధి కోల్పోయాడు. దాంతో కొన్ని నెలలుగా ఖాళీగా ఉంటున్నాడు. ఉపాధి దొరకకపోవడంతో విసుగుచెందిన నాగులు.. అసెంబ్లీ వద్దకు వచ్చి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పెట్రలో పోసుకొని మంటలు అంటుకున్నా కూడా.. నాగులు మాత్రం కేసీఆరే కాపాడాలని నినాదాలు చేశాడు. అసెంబ్లీ దగ్గర విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు.. వెంటనే అప్రమత్తమై నాగులుని ఆటోలో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

For More News..

పొలంలో మహిళా రైతుకు వజ్రం.. నాలుగు నెలల్లో ముగ్గురికి లభ్యం

రాష్ట్రంలో మరో 2,534 కరోనా కేసులు

వీడియో: రోహిత్ శర్మ సిక్స్ కొడితే.. స్టేడియం ముందు వెళ్తున్న బస్‌పై పడింది

Latest Updates