పర్సనల్​ వెహికల్స్​ ఎక్కువైతున్నయ్

పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​పై ఇంట్రెస్ట్​ చూపని సిటిజన్స్​
అన్ లాక్ లో ఎక్కువైన పర్సనల్ వెహికల్స్ యూజ్​
లాక్ డౌన్ రోజులతో పోల్చితే 25 శాతం పెరిగిన సంఖ్య
సిటీలో పెరిగిపోతున్నట్రాఫిక్ రద్దీ
విద్యా, ఐటీ సంస్థలు ఓపెనైతే మరింత రష్

హైదరాబాద్, వెలుగుసిటీ రోడ్లపై పర్సనల్​ వెహికల్స్​ ఎక్కువైతున్నాయి. అన్ లాక్ లో సిటిజన్స్​వీటితోనే ఎక్కువగా రోడ్డెక్కుతున్నారు. లాక్ డౌన్ ముందు రోజుల కంటే ఎక్కువ మంది యూజ్​చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్స్​కూడా అవుతున్నాయి. కరోనా కారణంగా  పబ్లిక్ ట్రాన్స్ పోర్టుపై ఇంట్రస్ట్​ చూపడం లేదు.  పర్సనల్ వెహికల్స్​లోనే జర్నీ బెటర్​అనుకుంటున్నారు. ప్రీ లాక్ డౌన్, లాక్ డౌన్ రోజులతో పోల్చితే 25 శాతం  పెరిగినట్లు ట్రాఫిక్​అధికారులు చెబుతున్నారు.  డిసెంబర్ లో రోడ్డెక్కే వాటి సంఖ్య మరో 25 శాతం ఎక్కువగా ఉంటుందని ట్రాఫిక్ ఎక్స్​పర్ట్స్ అంచనా వేస్తున్నారు. కరోనాతో లాక్​డౌన్​లో ఇంటికే పరిమితమయ్యారు. రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. అన్​లాక్​లో భాగంగా వెహికల్స్​రద్దీ పెరుగుతోంది. మెయిన్​రోడ్లపై వేలాది వెహికల్స్​ఒక్కసారిగా రోడ్డెక్కుతుండగా ట్రాఫిక్ స్లో అవుతోంది. ఇప్పటికీ స్కూళ్లు, కాలేజీలు ఓపెన్​చేయకపోవడం, ఐటీ కంపెనీల్లో వర్క్ ఫ్రం హోమ్​ ఉన్నా వెహికల్స్​రద్దీ లాక్ డౌన్ ముందుకంటే పది వేలు ఎక్కువగానే రోడ్డెక్కుతున్నాయి.

రెండు గంటలకోసారి  1.24 లక్షలు

ప్రస్తుతం సిటీలో ప్రతి రెండు గంటలకోసారి  1.24 లక్షల వెహికల్స్​రోడ్డెక్కుతున్నట్లుగా ఆటోమేటిక్ ట్రాఫిక్ కౌంటర్ అండ్ క్లాసిఫైర్ (ఏటీసీసీ) స్టడీలో తేలింది. లాక్​డౌన్​కు ముందు ఫిబ్రవరి లో 1.10లక్షలు, మార్చి లో 1.02లక్షలు రోడ్డెక్కాయి. ఏప్రిల్ లో  34,739 రోడ్డెక్కితే,  అన్​లాక్​లో ప్రస్తుతం 1,24, 528  రోడ్డుపైకి వస్తున్నాయి. ఇవి లాక్​డౌన్​కు ముందటితో పోల్చితే 10వేల వెహికల్స్, లాక్​డౌన్​ రోజులతో పోల్చితే నాలుగు రెట్లు ఎక్కువే. వచ్చే డిసెంబర్ నాటికి వీటి​సంఖ్య 1.6లక్షలు దాటొచ్చు.

ట్రాఫిక్​ హాట్ స్పాట్​ జంక్షన్లలో ​స్టడీ

సిటీలో మెయిన్​గా 7 జంక్షన్లు ట్రాఫిక్ హాట్ స్పాట్లు.  అవి చాదర్ ఘాట్ జంక్షన్, సీటీవో జంక్షన్, నల్గొండ క్రాస్ రోడ్, రసూల్ పురా, రవీంద్రభారతి జంక్షన్, సాగర్ సొసైటీ జంక్షన్, వై జంక్షన్ . ఆయా ఏరియాల్లో ఆయా ఏరియాల్లోంచి వచ్చి పోయే వెహికల్స్​రష్​ను ప్రత్యేక కెమెరాల ద్వారా ట్రాఫిక్ , మూమెంట్ ను ట్రాఫిక్ సెల్ అంచనా వేస్తుంది. ఆయా జంక్షన్ల నుంచే సిటీవ్యాప్తంగా ట్రాఫిక్ విస్తరిస్తుండగా, రోజువారీగా రోడ్డెక్కుతున్న వెహికల్స్​సంఖ్యను కూడా పక్కాగా లెక్కించే అవకాశం ఉంది.  దీంతో రోడ్లపై వెహికల్స్​రద్దీ ఎలా ఉందనే అంశాలతోపాటు, ట్రాఫిక్ జామ్​లను ఎప్పటికప్పుడు కంట్రోల్​చూసే వీలు ఉండేలా ఏటీసీసీ వింగ్​పనిచేస్తోంది. పెరిగిన రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్ సిగ్నల్స్​ను ఆపరేట్ చేస్తుండగా, ప్రధాన కూడళ్ల వద్ద వెహికల్స్ స్లోగా వెళ్తున్నాయి.

ఓన్​ వెహికల్స్​వారే ఎక్కువ

అన్ లాక్ తర్వాత సిటీ బస్సులు పరిమితంగానే నడుస్తున్నాయి. మెట్రో కూడా అందుబాటులో ఉంది.  పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో జర్నీ కంటే సొంత వెహికల్స్​లోనే వెళ్లేందుకు ఎక్కువగా ఇంట్రస్ట్​ చూపిస్తున్నారు.  ఇది లాక్ డౌన్ ముందు రోజుల కంటే  ఇప్పుడు ప్రతి రోజూ 10వేల వెహికల్స్​ఎక్కువగా రోడ్డెక్కుతున్నాయి. ఇందులో పర్సనల్ వెహికల్స్ వాటానే అధికమని ట్రాఫిక్ సెల్ నిపుణులు చెబుతున్నారు.  రానున్న రోజుల్లో వీటి సంఖ్య 25శాతం పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

Latest Updates