అనుమానాస్పద స్థితిలో యశోద డాక్టర్ మృతి

హైదరాబాద్: కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగాడు. వైద్య వృత్తిలో స్థిరపడ్డాక..  ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. కానీ ఏం జరిగిందో ఏమో.. అనారోగ్యంతో గురువారం రాత్రి ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. నగరంలోని  పేట్ బషీరాబాద్‌ పీఎస్ పరిధిలో జరిగిందీ ఘటన. స్థానికంగా ఉన్న గోదావరి హోం గాయత్రి నగర్ లో యశోద హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ సుభాష్(32)  మృతిచెందాడు.

మంచిర్యాల జిల్లా తంగూర్ గ్రామానికి చెందిన సుభాష్ 2017 లో..   నేరేడ్ మేట్ నివాసి డాక్టర్ లాస్య ను ఆర్యసమాజ్ లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. స్థానికంగా పద్మావతి అపార్ట్ మెంట్ 304 లో భార్యాభర్తల నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాలతో నేపథ్యంలో లాస్య సుభాష్ మధ్య కలహాలతో  ఇద్దరు కొంతకాలంగా దూరంగా ఉన్నారు. ఏమైందో ఏమో నిన్న జ్వరంగా ఉందని గురువారం  ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. నిన్న రాత్రి ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివరాల కోసం ప్రయత్నించగా బందువులు నిరాకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Pet Basheerbad yashoda hospital Doctor Subash Suspect Death

 

Latest Updates