GHMC ఎక్స్ ఆఫీషియో ఓటు హక్కుపై హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్: గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ ఆఫీషియో సభ్యుల ఓటు హక్కుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కును సవాల్ చేస్తూ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పిటిషన్ వేశారు. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 90(1)ని కొట్టివేయాలని అనిల్ కుమార్ ఆ పిటిషన్‌ లో కోరారు. ఈ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు.. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, ఎస్ఈసీ, జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ జనవరి 4కి వాయిదా వేసింది హైకోర్టు. కాగా.. రేపే జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ జరుగునుంది. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

Latest Updates