బాబ్రీ మసీదు కూల్చివేతపై హైకోర్టులో పిటిషన్

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ… హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో  నిందితులను నిర్దోషులుగా పేర్కొంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ అలహాబాద్ హైకోర్టులో  అయోధ్యకు చెందిన హాజీ మహ్మద్ అహ్మద్, సయ్యద్ అల్క్ అహ్మద్ అనే ఇద్దరు వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును పునర్ సమీక్షించాలని వారు తమ పిటిషన్ లో కోరారు. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున వీరు పిటిషన్ దాఖలు చేశారు.

 

Latest Updates