‘సైరా’ను నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

హైదరాబాద్ : సైరా నరసింహారెడ్డి  సినిమాను వివాదాలు వెంటాడుతున్నాయి.  సినిమాకు సెన్సార్  బోర్డు  ఇచ్చిన  క్లియరెన్స్ ను  నిలిపివేయాలంటూ… వడ్డెర  కులస్తులు హైకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు. నర్సింహారెడ్డి  ప్రధాన అనుచరుడు  అయిన  వడ్డెర ఒబన్న  క్యారెక్టర్ ను  వక్రీకరించి..  సినిమా తీశారని  ఆరోపించారు.

ఒబన్న ప్రాత్రను  తమిళనాడుకు  చెందిన  రాజు పాండే  అనే …లేని  పాత్రను సృష్టించి.. చరిత్రను  వక్రీకరించారన్నారు. సినిమాను  ఆపకపోతే విడుదలైన  రోజే  థియేటర్లలో  సినిమాను  అడ్డుకుంటామని  హెచ్చరించారు.

Latest Updates