గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియ‌మాకాల‌పై హైకోర్టులో పిటిషన్

రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ కోటాలో గోరేటి వెంకన్న, సారయ్య, దయానందల నియామకాలను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో ధన్ గోపాల్ పిటిషన్ వేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నియామకం చేపట్టారని పిటిషన్‌లో తెలిపారు. తన పేరును రెండుసార్లు గవర్నర్ ప్రతిపాదించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదేని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రివర్గ సిఫార్సులను ఆమోదించడంపై పిటిషనర్ ధన్ గోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టులో ధన్ గోపాల్ పిటిషన్‌ పై విచారణ జరిపిన కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

Latest Updates