ఈసారైనా స్కూల్ ఫీజులు తగ్గేనా?

‘ప్రైవేట్‌ ’ ఫీజులపై హైకోర్టులో పిటిషన్లు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌‌ స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న మేనేజ్‌మెంట్లపై చర్యలు తీసుకోవాలని
మంగళవారం హైకోర్టులో పలు పిల్స్, రిట్‌‌ పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలో ప్రైవేట్‌‌ స్కూళ్లలో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు
చేస్తున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై గతంలో తిరుపతి రావు కమిటీ వేశారని, ఇప్పటి వరకు కమిటీ సిఫారసులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. దీనిపై బుధవారం (ఈ నెల 11) వరకు పూర్తి వివరాలు తెలియజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

For More News..

రేవంత్ పోరాటంతో కాంగ్రెస్‌కు సంబంధం లేదు

కేటీఆర్ క్లాస్ తీసుకోలేదు: ఎమ్మెల్యే హరిప్రియ

Latest Updates