బామ్మర్ది కుటుంబంపై పెట్రోల్ పోసి నిప్పటించిన బావ

సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం కమ్మంపల్లిలో దారుణం జరిగింది. లక్ష్మీరాజ్యం అనే వ్యక్తి సొంత బామ్మర్ది కుటుంబంపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులందరినీ మొదటగా సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే వారిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో గాయపడిని వారిని రాజు, విమల, పవిత్ర, సునీత, చింటూ, రాజేశ్వరిగా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు కుటుంబ గొడవలతోనే లక్ష్మీరాజ్యం ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. ఈ ఘటన రాత్రి ఒకటి నుంచి రెండు గంటల మధ్య జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. లక్ష్మీరాజ్యం, అతని భార్యకు ఉన్న గొడవల కారణంగా ఆమె పుట్టింట్లోనే ఉంటుంది. కౌన్సిలింగ్ తర్వాత ఇద్దరూ కలిసి ఉంటున్నారు. ఈ మధ్యే మళ్లీ పుట్టింటికి వచ్చిన భార్యకోసం లక్ష్మీరాజ్యం నిన్న అత్త గారింటికి వచ్చాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత బామ్మర్ది కుటుంబం మొత్తంపై పెట్రోల్, టర్పంటైల్ పోసి చంపాలని ప్రయత్నించాడు. నిందితుడు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మణికొండకు చెందిన వాడుగా సమాచారం.

హ్యాట్సాఫ్ : తల్లిగా మారిన తండ్రి

Latest Updates