ఒక్కరోజే గ్యాప్‌.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

  • పెట్రోల్‌పై 5పైసలు, డీజిల్‌పై 13 పైసలు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్‌ ధరలు పెరడగం మళ్లీ స్టార్ట్‌ అయింది. వరుసగా 20 రోజులు పెరిగిన ధరలకు ఒక రోజు బ్రేక్‌ పడగా.. సోమవారం మళ్లీ పెరిగాయి. పెట్రోల్‌పై లీటర్‌‌కు 5పైసలు, డీజిల్‌పై 13పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు నిర్ణయించాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ రూ.80.43, డీజిల్‌ ధర రూ.80.53కి చేరింది. ఇప్పటి వరకు డీజిల్‌పై మొత్తం రూ.10.39పెరగగా, పెట్రోల్‌పై రూ.9.23 పెరిగింది. పెట్రలో కంటే డీజిల్‌ ధర ఎక్కువగా ఉంది.

వివిధ నగరాల్లో ధరల వివరాలు

నగరం           పెట్రోల్‌        డీజిల్‌
హైదరాబాద్‌       83.49        78.69
ఢిల్లీ                    80.43         80.53
చెన్నై                  83.63         77.72
విజయవాడ         84.15         79.19

Latest Updates