మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఆ మధ్య కాస్త తగ్గిన ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర మళ్లీ రూ. 71కి చేరువైంది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ డేటా ప్రకారం.. ఢిల్లీలో సోమవారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 70.91, లీటర్‌ డీజిల్‌ ధర రూ. 66.11గా ఉంది.  ధరలు అత్యధికంగా ఉండే ముంబైలో  లీటర్‌ పెట్రోల్‌ రూ. 76.54, డీజిల్‌ రూ. 69.23 పలుకుతోంది. లీటర్‌ పెట్రోల్‌ ధర కోల్‌ కతాలో రూ. 73.01, చెన్నైలో రూ. 73.61గా ఉంది. డీజిల్ ధర కోల్‌కతాలో రూ. 67.89, చెన్నైలో రూ. 69.84గా ఉంది. గతేడాది చివరితో పోల్చుకుంటే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దిల్లీలో పెట్రోల్‌ ధరపై రూ. 2.05, డీజిల్‌ ధరపై రూ. 3.25 పెరిగింది.

 

Latest Updates