పెట్రోలుకు ఎలక్షన్ కళ్లెం: 50 రోజుల్లో పెరిగింది 50 పైసలే

మార్చి 10. సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన రోజు. అప్పటి బ్యారెల్‌ ముడి చమురు ధర 4,650 రూపాయలు. దాదాపు 50 రోజుల తర్వాత ఒక బ్యారెల్ రేటు 5,238 రూపాయలు. రెండింటి మధ్య తేడా 588రూపాయలు. అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లు మండిపోతున్నా .. ఇండియాలో మాత్రం పెరగడం లేదు. ఈ 50 రోజుల్లో లీటరు పెట్రోల్ లేదా డీజిల్ పై పెరిగిన మొత్తం కేవలం 50 పైసలే. ఎన్నికల వల్లే చమురు ధరలు పెరగడలేదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై మోయలేని భారం పడుతోందని పేర్కొంటున్నారు.ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులపై ఇచ్చిన సడలింపులను అమెరికా ఎత్తేయడంతో మరింత ఒత్తిడిపడుతోందంటున్నారు.

పోయిన ఏడాదితో పోలికే లేదు!
2018 నవంబర్ 5వ తేదీన అంతర్జాతీయ మార్కె ట్లో బ్యారెల్‌ ముడి చమురు ధర 5110 రూపాయలుగా రికార్డైంది. అప్పుడు ఢిల్లీలో లీ టర్ పెట్రోల్ ధర78.56 రూపాయలు. తర్వాతి రోజుల్లో బ్యారెల్ ధర4889 రూపాయలకు దిగొచ్చిం ది. లీ టర్ పెట్రోల్ ధర మాత్రం రూ.77 నుంచి 78 మధ్యే ఉంది.ముంబైలో అయితే ఆ నెలంతా లీ టర్ పెట్రోల్ రేటు రూ.80 పైనే తిరిగిం ది తప్ప దిగి రాలేదు. అక్టోబర్ లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు ఆకాశాన్నంటిం ది.ఒక్క బ్యారెల్ ధర రూ.6 వేలకు పైనే పలికింది. దీం తోపెట్రోల్, డీజిల్ రేట్లు 38 శాతం పెరిగాయి .

ఎన్నికలు ముగిస్తే రేట్లు ఆకాశానికి
సాధారణ ఎన్నికలు ముగిస్తే దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు రోజు రోజుకీ పెరిగిపోయి ఆకాశాన్నంటుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ఆయిల్ పై అమెరికా ఆంక్షల వల్ల ధరలు అందనంత ఎత్తుకి ఎగిసే ప్రమాదం ఉందని అంటున్నారు.వచ్చే నెల 2వ తేదీతో ఇరాన్ ఆయిల్‌ పై ఇండియాకు అమెరికా ఇచ్చిన సడలింపులు పూర్తవుతాయి. దీంతోచమురు కో సం సౌదీ అరేబియా, మెక్సికో , కువైట్ పైఇండియా ఎక్కువగా ఆధారపడాల్సివుటుంది. దీంతో బ్యారెల్ రేటు రూ.5937పైగా ఉండొచ్చంటున్నారు.

Latest Updates