
- రాజధానిలోనూ మొదటిసారి రూ.85 దాటేసింది..
- ముంబైలో డీజిల్ రేటు ఆల్ టైమ్ హై
న్యూఢిల్లీ: లీటరు పెట్రోల్ ధర దేశ రాజధానిలో మొట్టమొదటిసారి రూ.85 మార్క్‌ను దాటింది. డీజిల్ రేటు కూడా రికార్డు గరిష్టానికి దగ్గర్లోకి చేరుకుంది. వరుసగా రెండు రోజులు పాటు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరను లీటరుపై 25 పైసలు చొప్పున పెంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం ధరల నోటిఫికేషన్లో పేర్కొన్నాయి. దీంతో లీటరు పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.85.20గా రికార్డయింది. లీటరు డీజిల్ ధర కూడా రూ.75.38 కు చేరుకుంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.91.80గా నమోదైంది. ముంబైలో డీజిల్ రేటు ఆల్ టైమ్ హైలో రూ.82.13గా ఉంది. సోమవారం కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుపై 25 పైసల చొప్పున పెరిగాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర 26 పైసలు పెరిగి రూ.88.63గా ఉంది. లీటరు డీజిల్ ధర 27 పైసలు పెరిగి రూ.82.26గా నమోదైంది. నెల విరామం తర్వాత జనవరి 6 నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజూ ధరలను సమీక్షించడం ప్రారంభించాయి. అప్పటి నుంచి లీటరు పెట్రోల్‌పై రూ.1.49, లీటరు డీజిల్‌పై రూ.1.51 ధర పెరిగింది.
For More News..