హైదరాబాద్​లో 90కి దగ్గర్లో పెట్రోల్ రేటు

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌–టైమ్ హైలను తాకుతూ వెహికల్ ఓనర్లను హడలెత్తిస్తున్నాయి. ఈ వారంలో వరుసగా నాలుగో సారి రేట్లు పెరిగాయి. శనివారం పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు 25 పైసలు చొప్పున ధరను పెంచినట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చెప్పాయి.  దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.85.70కు చేరింది. ముంబైలో ఏకంగా రూ.92.28గా రికార్డయింది. డీజిల్ రేటు కూడా ఢిల్లీలో లీటరు రూ.75.88కు, ముంబైలో రూ.82.66కు పెరిగింది. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.89.15, లీటరు డీజిల్ ధర  రూ.82.80గా నమోదైంది. ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై  ఇప్పటికే పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ, ఆర్థిక శాఖకు లేఖ రాసింది.

For More News..

పీఆర్సీపై నెలాఖరులోగా తేల్చకపోతే ఉద్యమం

పొలంలో రైతు సత్యాగ్రహ దీక్ష

ఆ ఆరుగురు ప్లేయర్లకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్​

Latest Updates