మ‌ళ్లీ మొద‌లైన ఆక్స్ ఫ‌ర్డ్ క‌రోనా వ్యాక్సిన్ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్

క‌రోనా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ ను బ్రిట‌న్ లో పున‌ ప్రారంభించిన‌ట్లు ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ఆక్స్ ఫ‌ర్డ్ – ఆస్ట్రాజెనెకా ఆధ్వ‌ర్యంలో క‌రోనా వ్యాక్సిన్ ఏజెడ్ డీ 1222 ను వాలంటీర్ల‌పై ప్ర‌యోగించారు. అయితే ఏజెడ్ డీ 1222 ఆ వ్యాక్సిన్ వేయించుకున్న వాలంటీర్ల‌లలో అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. దీంతో ఆ ట్ర‌య‌ల్స్ నిలిచిపోయాయి. తాజాగా మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి అనుమ‌తులు రావ‌డంతో బ్రిట‌న్ లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ పున ప్రారంభిస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది.

Latest Updates