ఈజీగా డబ్బులు సంపాదించేందుకు హాస్టళ్లలో చోరీ

హైదరాబాద్ : కూకట్ పల్లి పరిసరాల్లోని హాస్టళ్ళలోకి చొరబడి ల్యాప్‌టాప్ చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేశారు పోలీసులు. దొంగను తూర్పుగోదావరి జిల్లా, శృంగవరం గ్రామానికి చెందిన మంచిశెట్టి నాగ సత్యనారాయణగా గుర్తించారు. యం.ఫార్మసీ పూర్తి చేసుకొని, ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చిన సత్యనారాయణ.. అమీర్ పేట్ లోని ఓ హాస్టల్ లో ఉంటున్నాడు. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు, హాస్టళ్ళను టార్గెట్ గా పెట్టుకున్నాడు. ల్యాప్‌ టాప్స్, సెల్ ఫోన్స్ దొంగిలించడం మొదలుపెట్టాడు.

ఇంటర్వ్యూ కోసం వచ్చానని చెప్పి, హాస్టల్ లో రూమ్ తీసుకుని.. రూమ్ మేట్ లకు చెందిన ల్యాప్‌ టాప్స్, సెల్ ఫోన్లు అపహరించి పరారయ్యేవాడు. బుధవారం KPHB కాలనీలో ల్యాప్‌ టాప్ బ్యాగు ధరించి అనుమానస్పదంగా తిరుగుతున్న నాగ సత్యనారాయణను పోలీసులు అదుపులోకి విచారించగా.. తాను చేసిన నేరాలు ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుండి మూడున్నర లక్షల విలువైన 6 ల్యాప్‌ టాప్‌లు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండుకు తరలించామని తెలిపారు కూకట్ పల్లి ఏసీపీ సురేందర్ రావు.

Latest Updates