పీహెచ్ సీ, సీహెచ్ సీ ల్లో డాక్టర్ల‌ నియామకాలకు నోటిఫికేషన్

పీహెచ్ సీ, సీహెచ్ సీ ల్లో డాక్టర్ల‌ నియామకాల కు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. గాంధీ ఆసుపత్రి – 250, కింగ్ కోటి ఆస్ప‌త్రి – 100, గచ్చిబౌలి టిమ్స్ – 150, ఛాతీ ఆస్ప‌త్రి – 50, ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలకు 50 చొప్పున – 400, వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులకు – 241 మంది నియామకాల‌కు శ్రీకారం చుట్టింది. వీటితో పాటు 227 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను కాంట్రాక్టు పద్దతిలో నియమించునేందుకు సిద్ధ‌మైన ప్రభుత్వం..33 జిల్లాలోని పీహెచ్ సీ, సీ హెచ్ సీల్లో ఖాళీల భర్తీ కోసం నియామకానికి నోటిఫికేష‌న్ జారీ చేసింది. నెలకు రూ.70వేల వేతనంతో ఆరునెల‌ల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పీజీ చివరి సంవత్సరం వైద్య విద్యార్ధులను సీనియర్ రెసిడెంట్స్ గా నియమించుకోనుంది. ఇందుకోసం ఏడాది కాలానికి కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలో 1191 మందిని నియ‌మించుకోనుంది.

Latest Updates